WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. వాట్సాప్ కొత్త ఫీచర్‌పై నిఘా.. నిలివేయాలంటూ ఆదేశాలు

వాట్సాప్(WhatsApp) ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టబోతున్న కొత్త 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై భారత ప్రభుత్వం తీవ్ర అప్రమత్తమైంది.

Indian government issued orders to discontinuation of WhatsApp Username feature services.

  • వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ నిలిపివేత.
  • సైబర్ నేరాలపై కేంద్రం ఆందోళన.
  • మెటా వివరణకు ప్రభుత్వం నోటీసులు.

WhatsApp: వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టబోతున్న కొత్త ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై భారత ప్రభుత్వం తీవ్ర అప్రమత్తమైంది. వినియోగదారులు తమ మొబైల్ నంబర్ వెల్లడించకుండా, కేవలం ఒక ప్రత్యేక యూజర్‌నేమ్ ద్వారా ఇతరులతో చాట్ చేసేందుకు వీలు కల్పించేలా మెటా సంస్థ ఈ ఫీచర్‌ను రూపొందించింది. అయితే, దేశంలో ఈ ఫీచర్‌ను ప్రస్తుతానికి నిలిపివేయాలని కేంద్రం మెటాను ఆదేశించినట్లు సమాచారం. ఈ విధానం వల్ల సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు పెరిగే ప్రమాదం ఉందా అనే కోణంలో భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Pawan Kalyan: సోషల్ మీడియా ట్రోలింగ్స్ కి చెక్.. డిప్యూటీ సీఎం ఆఫీస్‌లో ప్రత్యేక విభాగం.. పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం

యూజర్‌నేమ్ ఫీచర్ ద్వారా సైబర్ నేరగాళ్లు తప్పుడు గుర్తింపులతో ఖాతాలు(WhatsApp) సృష్టించి ప్రజలను మోసం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి మోసపూరిత ఖాతాలను గుర్తించడం భద్రతా సంస్థలకు సవాలుగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, దుర్వినియోగాన్ని ఎలా అడ్డుకుంటారు, భద్రతా చర్యలు ఎలా ఉంటాయనే అంశాలపై మూడు రోజుల్లో సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ సమీక్ష పూర్తయ్యే వరకు భారత్‌లో దీనిని విడుదల చేయవద్దని స్పష్టం చేసింది.

మరోవైపు, ఈ ఫీచర్ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను మరింత మెరుగుపరుస్తుందని మెటా పేర్కొంది. ఇందులో యూజర్‌నేమ్ సృష్టించడం తప్పనిసరి కాదని, గరిష్టంగా 35 అక్షరాల వరకు నచ్చిన పేరును ఎంచుకోవచ్చని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ తరహాలోనే అకౌంట్స్ సెంటర్ ద్వారా అన్ని మెటా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే యూజర్‌నేమ్‌ను ఉపయోగించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వివరించింది. దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాల దృష్ట్యా, వినియోగదారుల రక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.