Cleanest State : దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రం,నగరాలు ఇవే..విజయవాడకు అవార్డు
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం(cleanest city)గా మళ్లీ మధ్యప్రదేశ్లోని "ఇండోర్" నిలిచింది.
- venkaiahnaidu
- Published On : November 20, 2021 / 02:52 PM IST
Cleanest (1)
Cleanest State : దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం(cleanest city)గా మళ్లీ మధ్యప్రదేశ్లోని “ఇండోర్” నిలిచింది. గత నాలుగేళ్లుగా దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ మొదటిస్థానంలో నిలుస్తూ వస్తున్న ఇండోర్..ఇప్పుడు ఐదోసారి పరిశుభ్రమైన నగరంగా నలిచింది.
కేంద్రప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన వార్షిక స్వచ్ఛత సర్వేలో… వరుసగా ఐదోసారి ఈ ఘనత సాధించింది ఇండోర్. ఆ తర్వాతి స్థానంలో సూరత్ నిలిచింది. పరిశుభ్రమైన నగరాల జాబితాలో రెండో స్థానంలో గుజరాత్లోని సూరత్, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నిలిచాయి.
స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డ్-2021లను శనివారం కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రకటించింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో.. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను విజేతలకు అందించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ అవార్డును కైవసం చేసుకుంది. ఇక,స్వచ్ఛమైన గంగా నగరంగా వారణాసికి అవార్డు లభించింది.
ALSO READ Sexual Abuse : కరస్పాండెంట్ వేధిస్తున్నాడని నర్సింగ్ విద్యార్ధినుల ధర్నా
