×
Ad

India : భారతదేశంలో కరోనా విలయం, 24 గంటల్లో 4 లక్షల కేసులు, 4 వేల మంది మృతి

ఇండియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతుండడం కలవర పెడుతోంది.

  • Published On : May 9, 2021 / 12:00 PM IST

India Covid

Daily COVID-19 : ఇండియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతుండడం కలవర పెడుతోంది. మరణాల సంఖ్య వేలల్లోనే ఉంటోంది. కొత్తగా 4,03,738 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఒక్కరోజులోనే 4 వేల 092 మంది చనిపోయారు. దేశంలో ప్రస్తుతం 37,36,648 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 2 లక్షల 42 వేల 362 మంది మృతి చెందారు. మరోవైపు భారత్ లో పాజిటివిటీ రేటు 22 శాతంగా ఉండగా..రికవరీ రేటు 81.90 శాతంగా ఉంది.

నిన్న 3,86,444 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,83,17,404 మంది కోలుకున్నారు. 37,36,648 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోందని, దేశ వ్యాప్తంగా 16,94,39,663 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.