Corona Update : దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 38,628 పాజిటివ్ కేసులు నమోదవగా, ఆదివారం 39 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది. ఇందులో 3,10,99,771 మంది బాధితులు కోలుకోగా, 4,06,822 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
- kunduru Vinod
- Published On : August 8, 2021 / 01:15 PM IST
Corona Update
Corona Update : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 38,628 పాజిటివ్ కేసులు నమోదవగా, ఆదివారం 39 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది. ఇందులో 3,10,99,771 మంది బాధితులు కోలుకోగా, 4,06,822 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
మరో 4,27,862 మంది వైరస్ వల్ల ప్రాణాలొదిలారు. గడిచిన 24 గంటల్లో 491 మంది మృతిచెందగా, 43,910 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా, దేశంలో 50,68,10,492 కరోనా డోసులను పంపిణీ చేశామని తెలిపింది. గత 24 గంటల్లో 55,91,657 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
