చిన్న చిన్న విషయాలకే జీవితంలో ఎంతో పోగొట్టుకున్నట్లు బాధపడేవారు. జీవితంలో ఎంతో కష్టపడేవారి నుంచి ఎంతో నేర్చుకోవాలి. మనస్సులో ధైర్యం ఉన్నప్పుడు ఎన్నైనా.. ఎంతటి కష్టాలను అయినా అధిగమించవచ్చు. శారీరక అంగ వైకల్యాన్ని కూడా సవాలు చేసిన ఓ మహిళ వీడియో ఇప్పుడు Inspire చేస్తూ నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఐపీఎస్ అధికారి పంకజ్ జైన్ ట్విట్టర్లో ఈ మేరకు ఒక వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో స్ఫూర్తిదాయకంగానూ షాకింగ్‌గా కూడా ఉంది. వీడియోలో, ఒక దివ్యాంగ మహిళ ఒక కుండలో నీటిని తీసుకువెళుతున్నట్లు కనిపిస్తుంది. వీడియో ప్రారంభంలో, కుండలో నీరు నింపుతున్నప్పుడు, ఆమె సాధారణమైన మహిళగా అనిపిస్తుంది. కానీ ఆ మహిళ నీటితో ముందుకు సాగిన వెంటనే, చూసేవారి ప్రేక్షకులు లేచి నిలబడతారు. “జీవితం తమకు కష్టమని భావించే వ్యక్తులు ఈ వీడియో చూడాల్సిందే” అంటూ పంకజ్ జైన్ వీడియో పోస్ట్ చేశారు.
అయితే, ఈ వీడియో ఎక్కడ నుండి వచ్చింది? ఎప్పుడు చిత్రీకరించబడింది. ఆమె ఎవరు? అనే సమాచారం మాత్రం వెల్లడి కాలేదు. వీడియోలో చూసిన మహిళకు సంబంధించి ఎటువంటి సమాచారంఐపీఎస్ అధికారి పంకజ్ జైన్ కూడా వెల్లడించలేదు. జీవితంలో సవాళ్లను స్వీకరించడం ద్వారా వాటిని ఎలా ఓడించవచ్చు. ఏ విధంగా ముందుకు సాగవచ్చు అనే విషయాన్ని ఆ మహిళ ద్వారా తెలుసుకోవచ్చు.
For those who think life is treating them tough pic.twitter.com/jElW7qc2Vi
— Pankaj Nain IPS (@ipspankajnain) August 24, 2020