అంతర్జాతీయ విమాన సర్వీసులపై బ్యాన్ పొడిగింపు
- venkaiahnaidu
- Updated on- January 29, 2021 / 06:34 AM IST
International Passenger Flights అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని DGCA(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొత్త కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై ని నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది.
అయితే, కార్గో విమానాలు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమాన సర్వీసులకు మాత్రం ఈ షరతులు వర్తించవని స్పష్టంచేసింది. ఈ మేరకు గురువారం సాయంత్రం డీజీసీఏ సంయుక్త డీజీ సునీల్ కుమార్ సర్క్యులర్ జారీ చేశారు.
కరోనా వైరస్ కారణంగా గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను డీజీసీఏ నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే, వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని దేశాలకు విమాన సర్వీసులను కొనసాగిస్తోంది.
