Gold Silver Prices: వార్ ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ.26వేలు పెరిగింది.. భగ్గుమన్న బంగారం, వెండి ధరలు..
హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,80,000 గా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.3లక్షల 10వేలుగా ఉంది.
- Naveen
- Updated on- February 28, 2026 / 11:53 PM IST
Gold Silver Prices Representative Image (Image Credit To Original Source)
Gold Silver Prices: ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం ఎఫెక్ట్ బంగారం, వెండి ధరలపై పడింది. గోల్డ్, సిల్వర్ ధరలకు రెక్కలు వచ్చాయి. మళ్లీ వెండి ధర 3 లక్షల మార్కును క్రాస్ చేసింది. అటు గోల్డ్ ధరలూ భగ్గుమంటున్నాయి. పసిడి ధరల చూపు రూ. 2 లక్షల వైపు ఉంది. శనివారం ఒక్కరోజే తులం పుత్తడి ధర 15 వేల రూపాయలు పెరిగింది. శనివారం ఒక్కరోజే కిలో వెండి ధర 26 వేల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,80,000 గా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.3లక్షల 10వేలుగా ఉంది.
కాగా, ఇది శుభ కార్యాల సమయం. ఈ సమయంలో బంగారం, పసిడి రేట్ల పెరుగుదుల సామాన్యులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రేంజ్ లో రేట్లు ఉంటే బంగారం, వెండిని కొనగలమా అని వర్రీ అవుతున్నారు.
