Israel’s New Secret Weapon : ఇజ్రాయెల్ కొత్త రహస్య ఆయుధాలు…స్పాంజ్ రసాయన గ్రెనెడ్ బాంబులు

రహస్య టన్నెళ్లలో ఉన్న హమాస్ ఉగ్రవాదులను హతమార్చేందుకు ఇజ్రాయెల్ తాజాగా రహస్య ఆయుధాలను రంగంలోకి దించింది. ఇజ్రాయెల్ కొత్తగా ప్రయోగించిన సీక్రెట్ ఆయుధాలు స్పాంజ్ రసాయన గ్రెనెడ్ బాంబులు బాగా పనిచేశాయని తాజా దాడుల్లో తేలింది....

Israel's New Secret Weapon Sponge Bombs

Israel’s New Secret Weapon : రహస్య టన్నెళ్లలో ఉన్న హమాస్ ఉగ్రవాదులను హతమార్చేందుకు ఇజ్రాయెల్ తాజాగా రహస్య ఆయుధాలను రంగంలోకి దించింది. ఇజ్రాయెల్ కొత్తగా ప్రయోగించిన సీక్రెట్ ఆయుధాలు స్పాంజ్ రసాయన గ్రెనెడ్ బాంబులు బాగా పనిచేశాయని తాజా దాడుల్లో తేలింది. హమాస్ ఉగ్రవాదులు దాక్కున్న వందల కిలోమీటర్ల టన్నెళ్లను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ కొత్తగా రహస్యంగా స్పాంజ్ రసాయన గ్రెనెడ్ బాంబులు ప్రయోగించింది.

Also Read : Hamas Air Chief : గాజాపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌ల దాడి…హమాస్ ఎయిర్ చీఫ్ అబూ రకాబా హతం

గాజా స్ట్రిప్ లోని సొరంగాల్లో దాక్కున్న హమాస్ ఉగ్రవాదులను ఇజ్రాయెల్ ఈ రహస్య ఆయుధాలతో మట్టుబెట్టింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హమాస్ టన్నెళ్లపై వైమానిక స్పాంజ్ బాంబు దాడులు చేసింది. హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ తమ భూబలగాల కార్యకలాపాలను విస్తరించిందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి చెప్పారు.

Also Read : Gaza : ఇజ్రాయెల్ దాడులతో గాజా గజగజ..ఫోన్లు, ఇంటర్‌నెట్ నిలిపివేత

శనివారం ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు ఉత్తర గాజాలో 150 భూగర్భ లక్ష్యాలపై దాడులు చేశాయి. దాడి చేసిన సైట్లలో టెర్రర్ టన్నెల్స్, భూగర్భ పోరాట ప్రదేశాలు,అదనపు భూగర్భ మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఇజ్రాయెల్ సైనిక ప్రకటన తెలిపింది. ఈ దాడుల్లో హమాస్ ఉగ్రవాదులు హతమయ్యారని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ దళాలు బుధ,గురువారాల్లో కూడా పరిమిత భూ దండయాత్రలు చేశాయి.

Also Read :  Mukesh Ambani : రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం : ముకేశ్ అంబానీకి బెదిరింపు

విస్తృతమైన హమాస్ సొరంగం నెట్‌వర్క్, వందల కిలోమీటర్ల పొడవు, 80 మీటర్ల లోతు వరకు ఉంది. లోతు ఉన్న సొరంగాలపై దాడి చేయడం ఇజ్రాయెల్‌కు అతిపెద్ద సవాలుగా మారింది. ఈ సవాలును పరిష్కరించడానికి ఇజ్రాయెల్ దళాలు స్పాంజ్ బాంబులు తయారు చేశాయి.

స్పాంజ్ బాంబులు అంటే ఏమిటి?

ఇజ్రాయెల్ దేశంలోని కొత్త రహస్య ఆయుధంగా అని పిలిచే స్పాంజ్ బాంబు ఒక రకమైన రసాయన గ్రెనేడ్. ఇందులో పేలుడు పదార్థాలు లేవు కానీ ఖాళీలు లేదా సొరంగం ద్వారాలను పేల్చడం ద్వారా మూసివేయడానికి ఉపయోగించవచ్చు.

స్పాంజ్ బాంబులు ఎలా పని చేస్తాయి?

స్పాంజ్ బాంబులు రక్షిత ప్లాస్టిక్ కంటైనర్‌లో నిక్షిప్తం చేశారు. ఇది రెండు విభిన్న ద్రవాలను విభజించే లోహ అవరోధంతో ఉంటాయి. యాక్టివేట్ అయిన తర్వాత ఈ ద్రవాలు విలీనం అవుతాయి. వాటి ఉద్దేశించిన గమ్యం వైపు ముందుకు సాగుతాయి.

హమాస్ వైమానిక దాడుల చీఫ్ అసేమ్ అబు రకాబా హతం

అంతకుముందు 2021వ సంవత్సరంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజా సరిహద్దు సమీపంలోని మాక్ టన్నెల్ సిస్టమ్‌లో వ్యాయామాల సమయంలో ఈ పరికరాలను మోహరించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు ఉత్తర గాజాలో 150 భూగర్భ లక్ష్యాలను ఢీకొన్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ మిలిటరీ హమాస్ వైమానిక దాడుల చీఫ్ అసేమ్ అబు రకాబాను హతమార్చింది.