GSLV NVS-1: మరికొద్ది సమయంలో నింగిలోకి దూసుకుపోనున్న జీఎస్‌ఎల్వీ–ఎఫ్12
రాకెట్ బయల్దేరిన 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కిలోమీటర్ల ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెడుతుంది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో 2,232 కిలోల ఎన్‌వీఎస్–01 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది
- tony bekkal
- Published On : May 29, 2023 / 07:44 AM IST
ISRO GSLV F12
ISRO: తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్వీ–ఎఫ్12 రాకెట్ సోమవారం నింగిలోకి దూసుకుపోనుంది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో చేపడుతున్న ప్రయోగానికి దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్–01 ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఉదయం 10:42 గంటలకు ఈ ప్రయోగం ప్రారంభం కానున్నట్లు ఇస్రో పేర్కొంది. కౌంట్‌డౌన్ నిర్వహించే ప్రక్రియ ఆదివారం ఉదయమే ప్రారంభమైంది. 27.30 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
Erdogan: టర్కీ ఎన్నికల్లో ఎర్డోగాన్ మరోసారి విజయం.. 11వ సారి అధ్యక్షుడిగా ఎన్నిక
ఈ రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు ఉంటుందని ఇస్రో తెలిపింది. రాకెట్ బయల్దేరిన 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కిలోమీటర్ల ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెడుతుంది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో 2,232 కిలోల ఎన్‌వీఎస్–01 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. ఇది విజయవంతమైతే ఈ శాటిలైట్ 12 ఏళ్లపాటు సేవలందించనుంది. దేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్–01 మొదటిది. ఈ ఉపగ్రహం ఇండియా భూభాగం చుట్టూ 1,500 కిలోమీటర్ల పరిధిలో రియల్ టైం పొజిషనింగ్ సేవలను అందిస్తుంది.
Ambati Rambabu : టీడీపీకి ఇదే చివరి మహానాడు, మళ్లీ వచ్చేది వైసీపీనే- మంత్రి అంబటి రాంబాబు
