Erdogan: టర్కీ ఎన్నికల్లో ఎర్డోగాన్ మరోసారి విజయం.. 11వ సారి అధ్యక్షుడిగా ఎన్నిక

టర్కీలో ఎర్డోగన్ గత అధ్యక్ష ఎన్నికల్లో అంటే 2018లో విజయం సాధించిన తరువాత పార్లమెంటరీ వ్యవస్థకు బదులుగా అధ్యక్ష వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు

Erdogan: టర్కీ ఎన్నికల్లో ఎర్డోగాన్ మరోసారి విజయం.. 11వ సారి అధ్యక్షుడిగా ఎన్నిక

Turkey president Erdogan

Turkey president Erdogan: టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష నేత కమల్ కల్‌దార్లుపై ఆయన విజయం సాధించారు. తద్వారా 11వ సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనెల 14న ఆ దేశంలో రాష్ట్రపతి ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ జరిగింది. జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (ఏకేపీ) అధినేత ఎర్దోగాన్‌కు మొదటి రౌండ్లో 49.4శాతం ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి కాల్‌దార్లుకు 45శాతం ఓట్లు వచ్చాయి.

 

ఇద్దరు నేతలకు మొదటి రౌండ్‌లో మెజార్టీ రాకపోవటంతో రెండోరౌండ్‌కు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎర్డోగాన్ విజయం సాధించారు. ఎర్డోగాన్ 20ఏళ్లుగా ఆ దేశానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2003 నుండి దేశం ఆయన నాయకత్వంలో నడుస్తుంది. అయితే, ఎన్నికల సమయంలో పాశ్చాత్య దేశాలు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. మరోవైపు టర్కీకి చెందిన ఆరు ప్రతిపక్ష పార్టీలతో కూడిన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ నేషన్ అలయన్స్ అభ్యర్థి కాల్‌దర్లు. టర్కీలో అతన్ని కమల్ గాంధీ అని కూడా పిలుస్తారు. 74ఏళ్ల కల్‌దార్లు గతంలో అనేక సార్లు ఎన్నికల్లో ఓడిపోయారు.

 

టర్కీలో ఎర్డోగాన్ గత అధ్యక్ష ఎన్నికల్లో అంటే 2018లో విజయం సాధించిన తరువాత పార్లమెంటరీ వ్యవస్థకు బదులుగా అధ్యక్ష వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. 2017లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా అధ్యక్షుడిగా అధికారులు భారీగా పెరిగాయి. దీని ద్వారా ఎర్డోగాన్ ప్రధాని పదవిని రద్దు చేసి ప్రధానమంత్రి కార్యనిర్వాహక అధికారాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. తద్వారా టర్కీలో అధ్యక్షుడు ప్రభుత్వానికి అధిపతి అయ్యాడు. ఎర్డోగాన్ 2028 సంవత్సరం వరకు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు