Cricketer Ravindra Jadeja: భార్యను ప్రశంసిస్తూ రవీంద్ర జడేజా ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు ..
రవీంద్ర జడేజా ట్వీట్‌ను పలువురు కాంగ్రెస్ నాయకులు తప్పుబడుతుండగా, బీజేపీ నాయకులు జడేజాకు అండగా నిలిచారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా తనను ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. అందులో తాను (జడేజా) నమస్కారం చేస్తున్న ఫొటోను షేర్ చేసి.. ‘నేను ఇండియన్’ అంటూ పేర్కొన్నాడు.
- Harish Thanniru
- Updated on- December 28, 2022 / 09:42 AM IST
Ravendar Jadeja
Cricketer Ravindra Jadeja: క్రికెటర్ రవీంద్ర జడేజాపై ట్విటర్లో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల గుజరాత్ సార్వత్రిక ఎన్నికల్లో రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా ఎమ్మెల్యేగా బీజేపీ తరపున విజయం సాధించిన విషయం విధితమే. అయితే, ఆమె ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ గురించి గొప్పగా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను రవీంద్ర జడేజా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన భార్య ప్రసంగాన్ని ప్రశంసించారు.
ఈనెల 26న జడేజా తన సతీమణి రివాబా జడేజా వీడియోను షేర్ చేశాడు. ఆర్ఎస్ఎస్ గురించి మీకున్న జ్ఞానాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. భారతీయ సంస్కృతి, మన సమాజం విలువలను నిలబెట్టే ఆదర్శనాలను ప్రోత్సహించే సంస్థ ఆర్ఎస్ఎస్. మీ జ్ఞానం, కృషిని ఇలానే కొనసాగించండి అంటూ భార్యను ప్రశంసిస్తూ జడేజా ట్వీట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాతో జడేజా ట్రోల్స్‌కు గురయ్యాడు. మీరు రాజకీయాల్లోకి వచ్చారా? బీసీసీఐ బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు మోకరిల్లిందా అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నించారు.
రవీంద్ర జడేజా ట్వీట్‌ను పలువురు కాంగ్రెస్ నాయకులు తప్పుబడుతుండగా, బీజేపీ నాయకులు జడేజాకు అండగా నిలిచారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా తనను ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. అందులో తాను (జడేజా) నమస్కారం చేస్తున్న ఫొటోను షేర్ చేసి.. ‘నేను ఇండియన్’ అంటూ పేర్కొన్నాడు. జడేజా భార్య రివాబా జడేజా రాజకీయ అరంగేట్రంలోనే గుజరాత్‌లోని జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన విషయం తెలిసిందే.
