Jcb Tyre
JCB Tyre: వెహికల్ వర్క్ షాప్‌లో టైర్‌లో గాలి నింపుతుండగా పేలి ప్రమాదం జరిగింది. చత్తీస్‌ఘడ్‌లోని రాయ్ పూర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. రాయ్‌పూర్‌లోని సిల్తారా ఇండస్ట్రీయల్ ఏరియాలో మే3న జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరెలో రికార్డు అయింది.
పెద్ద టైర్ లో వర్కర్ గాలిని నింపుతున్న సన్నివేశం రికార్డ్ అయింది. ఇంకో వ్యక్తి టైర్ లో గాలి ఎంత ఉందని చూసేందుకు రెండు మూడు సార్లు నొక్కి చూశఆడు. వెంటనే ప్రమాదం జరగడంతో వారిద్దరూ ఘటనాస్థలంలోనే కుప్పకూలిపోయారు. రికార్డ్ అయిన వీడియోలో టైర్ పేలి గాల్లోకి ఎగిరినట్లు కనిపించింది.
వారిద్దరూ మధ్యప్రదేశ్ లోని రెవా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. టైర్ పేలిన సమయంలోనే మృతి చెందారని, మరింత సమాచారం కోసం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినట్లు అధికారులు తెలిపారు.
Read Also : పెళ్లికి వెళ్లి వస్తుండగా పేలిన కారు టైర్లు..ఇద్దరు మృతి