Road Accident : పెళ్లికి వెళ్లి వస్తుండగా పేలిన కారు టైర్లు..ఇద్దరు మృతి

పెళ్లికి వెళితే చావు ఎదురొచ్చింది అన్నట్లుగా అయ్యింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఓ కారు టైర్లు పేలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

Road Accident : పెళ్లికి వెళ్లి వస్తుండగా పేలిన కారు టైర్లు..ఇద్దరు మృతి

New Project (15)

Ranga Reddy Road Accident : పెళ్లికి వెళితే చావు ఎదురొచ్చింది అన్నట్లుగా అయ్యింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఓ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్ సమీపంలో సాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించి కారు ప్రమాదం జరిగింది.

Ranga Reddy Road Accident: పెళ్లికి వెళితే చావు ఎదురొచ్చింది అన్నట్లుగా అయ్యింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఓ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్ సమీపంలో సాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించి కారు ప్రమాదం జరిగింది. వివాహానికి హాజరై ఇంటికి వస్తుండగా.. కారు అదుపు తప్పి కారు రెండు టైర్లు పేలిపోయాయి.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమందిలో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడినివారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మృతులు వట్టినాగులపల్లికి చెందిన తలపల్లి రామకృష్ణ, మటూరి శ్రీకాంత్ గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు. కారు వేగంతో వెళుతుండటంతో వాహన టైర్లు పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. హైదరాబాద్‌ లింగంపల్లి నుంచి యాచారం మండలం మాల్‌లో జరిగిన వివాహానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.