Siddaramaiah : అవును రాజీనామా చేస్తున్న.. ప్రకటించిన సిద్ధ రామయ్య.. ఎప్పుడంటే..
Siddaramaiah : రాజీనామా వార్తలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. అధికారిక ప్రకటన చేశారు.
- Dharani Pilli
- Updated on- May 28, 2026 / 11:24 AM IST
Karnataka CM Siddaramaiah announces resignation at breakfast meet in Bengaluru
- రాజీనామా వార్తలపై సిద్ధరామయ్య స్పందన
- మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజీనామా
- బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో ప్రకటించిన సిద్ధరామయ్య
Siddaramaiah : కర్ణాటక రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠతకు శుభం కార్డు పడింది. సిద్ధరామయ్య ఎట్టకేలకు తన రాజీనామా వార్తలపై స్పందించారు. రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా సిద్ధరామయ్యనే అధికారికంగా ప్రకటించారు. గురువారం ఉదయం డీకే శివకుమార్, కేబినెట్ సహచరులతో నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో ఈ ప్రకటన చేశారు. మీటింగ్ ముగిసిన తర్వాత సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సిద్ధరామయ్య తన రాజీనామాను గవర్నర్ కి సమర్పించనున్నారు.
సిద్ధరామయ్య రాజీనామా వేళ కర్ణాటక గవర్నర్ బెంగళూరులో అందుబాటులో లేకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత పని నిమిత్తం కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ బెంగళూరు నుంచి సొంతూరికి వెళ్లారు. ఆయన బెంగళూరుకు ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. అయితే గవర్నర్ ఎక్కడి నుంచైనా రాజీనామాను ఆమోదించవచ్చు.
ఇదిలా ఉంటే బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ వేళ భావోద్వేగ సన్నివేశం వెలుగు చూసింది. డీకే శివకుమార్.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనను ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
