Miss India 2022: కర్ణాటకకు చెందిన సినీ శెట్టికి మిస్ ఇండియా 2022
ముంబైలో పుట్టి కర్ణాటకలో పెరిగిన సినీ శెట్టికి మిస్ ఇండియా 2022 కిరీటం దక్కింది. 58వ ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలో విజయాన్ని వరించింది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి చేతుల మీదుగా సినీ శెట్టి కిరీటం అందుకున్నారు.
- Subhan Ali Shaik
- Published On : July 4, 2022 / 06:55 AM IST
Miss India
Miss India 2022: ముంబైలో పుట్టి కర్ణాటకలో పెరిగిన సినీ శెట్టికి మిస్ ఇండియా 2022 కిరీటం దక్కింది. 58వ ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలో విజయాన్ని వరించింది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి చేతుల మీదుగా సినీ శెట్టి కిరీటం అందుకున్నారు. రాబోయే ఎడిషన్ లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొననున్నారామె.
సినీ శెట్టి కర్ణాటకలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం CFA అనే ప్రొఫెషనల్ కోర్సులో ఉన్నారు. ఇంకా ఈమె భరత నాట్యం డ్యాన్సర్ కూడా.
ఇదిలా ఉంటే 21 సంవత్సరాల శినతా చౌహాన్ ను సెకండ్ రన్నరప్ గా ప్రకటించగా, రుబాల్ షెకావత్ ను ఫస్ట్ రన్నరప్ గా ప్రకటించారు. ఫెమినా మిస్ ఇండియా నిర్వహించిన అందాల పోటీల గురించి.. అదే సంస్థ సోషల్ మీడియా ద్వారా విజేతలను ప్రకటిస్తూ కంగ్రాట్స్ తెలియజేసింది.
