Kirtankar Tajuddin Baba : కీర్తనలు పాడుతూ..ప్రాణాలు వదిలిన బాబా.. వీడియో
స్టేజీపై కీర్తనలు పాడుతూ ప్రాణాలు వదిలారు కీర్తంకర్ తాజుద్దీన్ బాబా. కీర్తనలు పాడుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో కింద కూర్చున్నాడు.
- kunduru Vinod
- Published On : September 28, 2021 / 08:59 PM IST
Kirtankar Tajuddin Baba
Kirtankar Tajuddin Baba : స్టేజీపై కీర్తనలు పాడుతూ ప్రాణాలు వదిలారు కీర్తంకర్ తాజుద్దీన్ బాబా. కీర్తనలు పాడుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో కింద కూర్చున్నాడు. అనంతరం కొద్దీ సేపటికే ప్రాణాలు వదిలాడు. మహారాష్ట్ర జాల్నా జిల్లా బోధ్లాపూర్‌కు చెందిన బాబా.. సక్రి తాలూకాలోని నిజాంపూర్ సమీపంలోని జామ్దాకు సోమవారం భజన కోసం వెళ్లారు. సోమవారం రాత్రి గ్రంథరాజ్ జ్ఞానేశ్వరి మహారాజ్ పారాయణ్ సప్తహ్‌కు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఆయన కీర్తనలు ఆలపించడం ప్రారంభించారు.
కొద్దీ సేపటికే చాతి నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. అయితే ఆయనకు గుండెపోటు వచ్చిందనే విషయం పక్కన ఉన్నవారు గుర్తించలేకపోయారు. బాబా కిందకుర్చున్నాడేమో అనుకున్నారు. బాబా ఎంతకీ లేవకపోవడంతో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. కీర్తంకర్ తాజుద్దీన్ బాబా పుట్టుకతోనే ముస్లిం అయినప్పటికీ.. ఆయన వార్కారీ జీవనశైలిని అవలంభించారు. ప్రతి నిత్యం హరిపత్, భజనలకు హాజరయ్యే వారు. హిందూ- ముస్లిం మధ్య విభేదాలను తొలగించి, ప్రజల్లో అవగాహన కలిగించేలా ఆయన ప్రదర్శనలు ఇస్తుంటారు.
ह. भ. प. ताजुद्दीन महाराज यांचे निधन, कीर्तन सुरू असतानाच आला हृदयविकाराचा झटका pic.twitter.com/trOcLva8yA
— News18Lokmat (@News18lokmat) September 28, 2021
