Asha Bhosle: ఆసుపత్రిలో ప్రముఖ గాయని ఆశా భోస్లే.. ఆందోళనలో అభిమానులు

ఆశా భోస్లేకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. తన మధుర గాత్రంతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించారు.

  • Published On : April 12, 2026 / 12:00 AM IST

Asha Bhosle: ప్రముఖ గాయని ఆశా భోస్లే అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. శనివారం సాయింత్రం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆశా భోస్లే వయసు 92 ఏళ్లు. ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది. ఎమర్జెన్సీ విభాగంలో ఆమెకు ట్రీట్ మెంట్ చేస్తున్నట్లు సమాచారం. ఆశా భోస్లే ఆసుపత్రిలో చేరారని తెలిసి ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గెట్ వెల్ సూన్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఆశా భోస్లేకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. తన మధుర గాత్రంతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించారు. తిరుగులేని లెజెండరీ సింగర్‌గా ర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో మరుపురాని పాటలు పాడారు. పదేళ్ల వయసు నుంచే తన పాటలతో మెప్పించారు ఆశా భోస్లే. సుమారు 800లకు పైగా సినిమాల్లో 12 వేలకు పైగా పాటలు పాడారు. పియ తు అబ్ తో ఆజా, జాయియే ఆప్ కహా జాయేంగే, రంగీలా రే, షరారా షరారా లాంటి మర్చిపోలేని పాటలు పాడారు. ఈ సెప్టెంబర్ 8తో ఆమెకు 93 ఏళ్లు.