LPG Cylinder : గ్యాస్ బుక్ చేశారా? డెలివరీ చెయ్యకుండానే మీకు డెలివరీ అయినట్టు మెసేజ్ వస్తే.. ఇలా చేయండి తిక్క కుదురుతుంది..

LPG cylinder : వినియోగదారులు ఎటువంటి కొరతను ఎదుర్కోరని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ.. సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత కూడా డెలివరీ సకాలంలో అందడం లేదని తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటువంటి సందర్భాలలో వివిధ గ్యాస్ కంపెనీలు ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేశాయి.

LPG cylinder

  • తీవ్రమవుతున్న గ్యాస్ సిలిండర్ల కొరత
  • బుకింగ్, డెలివరీ విషయాల్లో తప్పని ఇబ్బందులు
  • ఫిర్యాదులు చేసేందుకు హెల్ఫ్‌లైన్ నెంబర్లు

LPG cylinder : ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇండియాలో గ్యాస్ కొరత పెరిగింది. చాలా మంది ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళనకు గురవుతున్నారు. కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. యుద్ధం తీవ్రత పెరిగితే రానున్న రోజుల్లో గ్యాస్ దొరికే పరిస్థితి ఉండదని ఆందోళనతో ముందస్తుగా గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read : Gold Price Today : పడిపోతున్న గోల్డ్ రేటు.. వరుసగా మూడోరోజు భారీగా తగ్గుదల.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. గతంలో సిలిండర్‌కు సిలిండర్‌కు మధ్య 21రోజుల్లో బుకింగ్ చేసుకోవచ్చు. కానీ, ఆ గడువును ప్రస్తుతం 25 రోజులకు పెంచేసింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే సిలిండర్ బుకింగ్ గడువును 45రోజులకు పెంచేసింది.

సరఫరాలో కొరతకుతోడు గ్యాస్ బుకింగ్‌లు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో సిలిండర్ డెలివరీలో అనేక మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరు సిలిండర్ డెలివరీలు ఆలస్యంగా జరిగాయని ఫిర్యాదు చేస్తుండగా.. మరికొందరు అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తున్నారని.. మరికొందరు సిలిండర్ డెలివరీ చెయ్యకుండానే డెలివరీ అయినట్లు మెస్సేజ్ వస్తుందని ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధమని ప్రభుత్వం హెచ్చరించింది. గ్యాస్ కంపెనీలు డబ్బులు అదనంగా డిమాండ్ చేయడం, ధృవీకరించబడిన బుకింగ్‌ను అందించడానికి నిరాకరించే డీలర్ వివరాలను తెలియజేయాలని వినియోగదారులకు ప్రభుత్వం సూచించింది.

ఎల్‌పీజీ వినియోగదారుల ఫిర్యాదులకోసం హెల్ప్‌లైన్ నంబర్లను కేటాయించింది. ఎల్పీజీ సరఫరాలో సమస్యలు ఎదుర్కొంటున్న వినియోగదారులు చమురు మార్కెటింగ్ కంపెనీల అధికారిక హెల్ప్‌లైన్‌లను సంప్రదించి ఫిర్యాదుచేసే అవకాశం ఉంది.

ఇండేన్ గ్యాస్ కస్టమర్ల కోసం..
మీరు ఇండేన్ గ్యాస్ కస్టమర్ అయితే, సిలిండర్ డెలివరీలో సమస్యలు ఎదుర్కొంటుంటే.. మీరు కంపెనీ హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రందించొచ్చు. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు 1800-2333-555 టోల్ ఫ్రీ నవంబర్‌కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
భారత్ గ్యాస్ కస్టమర్ల కోసం..
భారత్ గ్యాస్ కస్టమర్ అయితే.. 1800 22 4344 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయొచ్చు.
ఉజ్వల యోజన LPG వినియోగదారులు..
టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ 1800-233-3555, ఉజ్వల హెల్ప్‌లైన్ 1800-266-6696 కు ఫిర్యాదు చేయొచ్చు.

దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నేపథ్యంలో గృహ వినియోగదారులు ఉపయోగించే ఎల్‌పీజీకి ప్రాధాన్యత ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రాధాన్యత క్రమంలో ఎల్పీజీ గ్యాస్ ను ఆస్పత్రులు, విద్యా సంస్థలు, అనాథ శరణాలయాలు.. ఇతర సంస్థలకు కేటాయించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.