కరోనా నెగిటివ్ : ఆనందంతో చిందేసిన కుటుంబం… వీడియో వైరల్
- Chandu 10tv
- Updated on- August 19, 2020 / 03:31 PM IST
దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నెగెటివ్ అని తేలితే వారి ఆనందాన్నికి హద్దేముంటుంది ? అలాంటిదే మధ్యప్రదేశ్ లో ఓ కుటుంబం తమకు నెగిటివ్ అని రావటంతో పట్టరాని ఆనందంతో డ్యాన్స్ చేశారు. మధ్యప్రదేశ్ లోని కాంతి జిల్లా ప్రభుత్వ హాస్పటల్ లో కోవిడ్ ఐసోలేషన్ వార్డు లో ఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ నుంచి కోలుకుని నెగెటివ్ తో బయటపడిన కుటుంబ సభ్యుల్లో 8 మంది ఓ బాలీవుడ్ మూవీ సాంగ్ కి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మధ్యప్రదేశ్ లోని ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారిని జిల్లా హాస్పటల్లో అడ్మిట్ అయ్యాయి, చికిత్స ను పొందారు. అది ఒక ఉమ్మడి కుటుంబం. చికిత్స అనంతరం అందరికీ నెగెటివ్ అని రావడంతో ఆ కుటుంబంలోని 8 సభ్యులు సుశాంత్ సింగ్ నటించిన ‘చిచోర్’చిత్రంలోని ‘చింతా కర్ కే క్యా పాయేగా, మర్ నే సే పహ్ లే మర్ జాయెగా’ అనే పాటకు చిందేశారు. కుటుంబంలో చిన్నారులతో సహా డ్యాన్స్ చేశారు.
చికిత్స తర్వాత వారందరికీ కరోనా నెగిటివ్ అని రావటంతో ఆగస్టు15, 2020 న డిశ్యార్జ్ చేసినట్లు డాక్టర్లు తెలిపారు. డిశ్చార్జ్ కి ముందు వారు ఐసోలేషన్ వార్డులో చిన్న, పెద్ద, మహిళలు అందరూ ఆనందంతో డ్యాన్స్ చేశారు.
In Katni, family celebrates successfully defeating #COVID19India infection by dancing to tunes of a Bollywood song, before being discharged @ndtvindia @ndtv @GargiRawat @ShonakshiC #Corona #covid pic.twitter.com/Yzs3B1AFgd
— Anurag Dwary (@Anurag_Dwary) August 18, 2020
