క్రికెట్ ఆడుతూ..చనిపోయిన బ్యాట్స్ మెన్, వీడియో వైరల్
- madhu
- Published On : February 18, 2021 / 08:32 AM IST
tournament at Jadhavwadi : ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కాదు. మనమధ్యలోనే అంతసేపు గడిపిన వాళ్లు..కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. మరణం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఉన్న చోటనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తూనే ఉంటాం. క్రికెట్ లో..బంతి తగిలి..ఇతరత్రా కారణాలతో..మరణిస్తుంటారు. తాజాగా..క్రికెట్ ఆడుతూ..ప్రాణాలు వదిలిన ఓ ఘటన అందర్నీ కలిచివేస్తోంది. ఈ ఘటన పూణేలోని జున్నార్ మండలంలో చోటు చేసుకుంది.
జున్నార్ మండలంలో కొంతమంది కలిసి మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు. నాన్ స్ట్రైక్ వైపు నిలబడి ఓ బ్యాట్స్ మెన్ ఉన్నాడు. బౌలర్ బంతి వేయగా…అవతలి వైపు బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్ మెన్ భారీ షాట్ ఆడబోయాడు. మిస్ కావడంతో బంతి కీపర్ లోకి వెళ్లింది. నాన్ స్ట్రైక్ వైపున ఉన్న వ్యక్తి పరుగు తీసేందుకు ప్రయత్నించి..మరలా వెనక్కి వచ్చాడు. కీపర్ బంతి బౌలర్ కు వేశాడు. అనంతరం నాన్ స్ట్రైక్ ఉన్న వ్యక్తి..అంపైర్ తో…మాట్లాడాడు.
తర్వాత..బ్యాట్ పట్టుకుని మోకాళ్లపై కూర్చొన్నాడు. అలా కూర్చొన్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అంపైర్ వెంటనే స్పందించారు. దగ్గరిలోని వైద్యుని వద్దకు తీసుకెళ్లగా..అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించారు. గుండెపోటు కారణంగా..అతను చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుని పేరు బాబు నలవాడెగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వీడియో చూసిన వారందరూ..బాధాతప్త హృదయాలతో కామెంట్స్ పెడుతున్నారు.
पुणे : जाधववाडी (ता. जुन्नर) येथे स्थानिक क्रिकेट स्पर्धेत खेळताना महेश उर्फ बाबु विठ्ठल नलावडे (वय ४७,रा.धोलवड, ता. जुन्नर) या खेळाडूचा मृत्यू झाला. फलंदाजीसाठी मैदानात असतानाच हृदयविकाराच्या तीव्र झटका आल्याने महेश मृत्युमुखी पडला. #pune #Cricket #PuneNews pic.twitter.com/8pa4wfK5nJ
— sakalmedia (@SakalMediaNews) February 17, 2021
