Karma : వైరల్ వీడియో: కర్మ అంటే ఇలానే ఉంటుంది.
తన బలం ఉపయోగించి చెట్టును కాలితో తన్ని కింద పడేశాడో వ్యక్తి.. తన దగ్గర చాలా బలం ఉందని అనుకునే లోపే విరిగిన చెట్టు వచ్చి తలపై పడింది. దీంతో సదరు వ్యక్తి కుప్పకూలిపోయాడు.
- kunduru Vinod
- Updated on- July 2, 2021 / 03:06 PM IST
Karma
Karma : ఎవరికైనా ఏదైనా జరిగితే వెంటనే గుర్తొచ్చే పదం కర్మ. గతంలో అతడు తప్పు చేశాడు.. అందుకే ఇప్పుడు ఇలా జరిగింది అని అంటుంటారు. మంచైనా, చెడైనా ఎదో ఓ రోజు ఫలితం అనుభవించక తప్పదని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుత రోజుల్లో చెడు చేయతలచిన వారు వెంటనే ఎదో ఒక రూపంలో కర్మ అనుభవిస్తున్నారు.
కాగా తాజాగా వైరల్ గా మారిన ఓ వీడియోలోని వ్యక్తి విషయంలో కర్మసిద్ధాంతం వెంటనే పనిచేసింది. తన బలం ఉపయోగించి చెట్టును కాలితో తన్ని కింద పడేశాడో వ్యక్తి.. తన దగ్గర చాలా బలం ఉందని అనుకునే లోపే విరిగిన చెట్టు వచ్చి తలపై పడింది. దీంతో సదరు వ్యక్తి కుప్పకూలిపోయాడు.
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారులు సుధా రామెన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. షేర్ చేసిన కొద్దీ గంటల్లోనే 90 వేలమందికి పైగా ఈ వీడియో వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. కర్మ ఫలం అంటే ఇదే.. మనం ఏ చేస్తామో.. అది తిరిగి వస్తుంది. అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ.. ” గొప్పకు పోయాడు.. చివరకు పాఠం నేర్చుకున్నాడు.” అని రాసుకొచ్చారు.
All that you do comes back to you – Good and Bad pic.twitter.com/kMHZGF3NLi
— Sudha Ramen ?? (@SudhaRamenIFS) July 1, 2021
