Man Killed Wife : మద్యానికి డబ్బులు ఇవ్వలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త

పర్వీన్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.

man killd wife

Man Killed Wife in Mumbai : ముంబయిలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని 42 ఏళ్ల వ్యక్తి తన భార్యను కొట్టి చంపాడు. నిందితుడిని మొయినుద్దీన్ నస్రుల్లా అన్సారీగా, మృతురాలిని 36 ఏళ్ల పర్వీన్ మొయినుద్దీన్ అన్సారీగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరేగావ్, మలాడ్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పక్కన దంపతులు నివాసిస్తున్నారు. పర్వీన్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.

POCSO Cases : ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో లక్షలాది పోక్సో కేసులు పెండింగ్.. పరిష్కారానికి 9 నుంచి 25ఏళ్లు పట్టే అవకాశం

నిందితుడు నగరం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా మలాడ్‌లోని మల్వానీలో బోరివలి ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 302 కింద మోయినుద్దీన్ అన్సారీపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.