అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మమతా బెనర్జీ అనుమానాలు
రాజకీయ నాయకులకు కూడా రక్షణ లేదని అన్నారు. అజిత్ పవార్ బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నారన్న అంశంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ప్రస్తావించారు.
Mamata Banerjee (Image Credit To Original Source)
- రాజకీయ నాయకులకు కూడా రక్షణ లేదు
- బీజేపీతో పవార్ తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నారు
- ప్రమాద ఘటన అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది
Ajit Pawar death: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని మమత డిమాండ్ చేశారు. అజిత్ పవార్ మరణానికి దారితీసిన ఈ ఘటనలో దురుద్దేశం ఉండవచ్చని అన్నారు. దేశంలో రాజకీయ నాయకుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు.
మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. అజిత్ పవార్ మరణ వార్త తనను షాక్కు గురి చేసిందని చెప్పారు. ఈ ఘటనను దేశానికి పెద్ద నష్టంగా అభివర్ణించారు. రాజకీయ నాయకులకు కూడా రక్షణ లేదని అన్నారు. అజిత్ పవార్ బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నారన్న అంశంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ప్రస్తావించారు.
Also Read: ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం ఇంజక్షన్లు ఇచ్చి తల్లిదండ్రులను చంపేసిన కూతురు.. దేవుడా..
ఇవాళ చోటుచేసుకున్న ఘటన అనేక ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆమె అన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగే దర్యాప్తుకే విశ్వసనీయత ఉంటుందని చెప్పారు. సుప్రీంకోర్టుపైనే తమకు నమ్మకం ఉందని, ఇతర ఏ సంస్థపైనా లేదని బెనర్జీ వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలు స్వతంత్రత కోల్పోయాయని ఆరోపించారు.
బారామతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు మరణించడంతో సరైన సమగ్ర దర్యాప్తు జరగాలని పలువురు రాజకీయ నాయకులు కోరారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, వంచిత్ బహుజన్ అఘాడీ నేత ప్రకాశ్ అంబేడ్కర్ సంతాపం తెలియజేస్తూ, ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని అన్నారు.
