UP: ఒకే ఇంట్లో ఐదుగురు దారుణ హత్య
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా ఇనాయత్ నగర్ పోలీసు సర్కిల్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే రమేష్ అనే వ్యక్తి భార్య ముగ్గురు పిల్లలతో కలిసి ఇనాయత్ నగర్ లో నివాసం ఉంటున్నారు.
- kunduru Vinod
- Published On : May 23, 2021 / 03:07 PM IST
Up
UP: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా ఇనాయత్ నగర్ పోలీసు సర్కిల్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే రమేష్ అనే వ్యక్తి భార్య ముగ్గురు పిల్లలతో కలిసి ఇనాయత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. రమేష్ కి అతడి మేనల్లుడు పవన్ తో ఆస్తి తగాదాలు ఉన్నాయి.
గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం అర్ధరాత్రి కత్తితో మామ రమేష్ ఇంటికి వచ్చిన పవన్ ఇంట్లో ఉన్న ఐదుగురిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో రమేష్, అతడి భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు ఓ కుమార్తె ఉన్నారు.
దాడి సమయంలో వారి అరుపులు విని చుట్టుపక్కల వారు పరిగెత్తుకుని వచ్చే సరికి పవన్ అక్కడినుంచి పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పవన్ కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.
