×
Ad

Maoists Killed SI : మరోసారి రెచ్చిపోయిన మావోలు..కిడ్నాప్‌ చేసిన ఎస్‌ఐ మురళిని హత్య చేశారు

మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఈ నెల 21న చత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో కిడ్నాప్‌ చేసిన SI తాటి మురళిని హతమర్చారు.

  • Published On : April 24, 2021 / 10:32 AM IST

Maoists Who Kidnapped And Killed Si Murali

Maoists killed SI Murali : మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఈ నెల 21న చత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో కిడ్నాప్‌ చేసిన SI తాటి మురళిని హతమర్చారు. బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో మురళీ పాత్ర కీలకమని భావించిన మావోయిస్టులు అతడిని కిడ్నాప్‌ చేశారు. ప్రజా కోర్టు నిర్వహించి అతడికి మరణశిక్ష విధించారు. అతడిని హత్య చేసిన అనంతరం మల్లూరులోని GLS హాస్పిటల్‌ దగ్గర నడిరోడ్డుపై మృతదేహాన్ని వదిలి వెళ్లారు. అతని మృతదేహం వద్ద ఓ లేఖను సైతం మావోయిస్టులు విడిచి వెళ్లారు.

డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌లో ఉన్న మురళీ.. 2006 నుంచి 2021 వరకు అనేక అకృత్యాలకు పాల్పడ్డాడని.. ఆదివాసీలకు ఇబ్బందులకు గురిచేశాడని, అనేక అత్యాచారాలు చేశాడని లేఖలో ఆరోపించారు.. PLGA కార్యకర్తలను హత్య చేయడమే గాక, హింసించాడన్నారు…. బస్తర్‌ ప్రాంతంలో ఉన్న ఖనిజ నిక్షేపాలను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు.

ఇందుకు CRPF, DRG, STF దళాలు సహకరిస్తున్నాయన్నారు.. మురళీ లాంటి పనులు చేసిన వారికి ఇదే గతి పడుతుందని లేఖలో హెచ్చరించారు మావోయిస్టులు.. భద్రతా బలగాల్లో పనిచేస్తున్నవారంతా తమ పదవులకు రాజీనామా చేసి.. ప్రజల పక్షాన పోటీ చేయాలని డిమాండ్ చేశారు.