Massive Fire At Delhi Restaurant : ఢిల్లీలోని రెస్టరెంట్‌లో అగ్నిప్రమాదం.. 20మంది సజీవదహనం.. పలువురికి గాయాలు
Massive Fire At Delhi Restaurant : దేశ రాజధాని ఢిల్లీలోని మాలవీయనగర్లోని లెమన్ గ్రీన్ రెస్టరెంట్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
- Harish Thanniru
- Updated on- June 3, 2026 / 01:30 PM IST
Massive Fire At Delhi Restaurant
Massive Fire At Delhi Restaurant : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. మాలవీయనగర్‌లోని లెమన్ గ్రీన్ రెస్టరెంట్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20మందికిపైగా సజీవదహనం అయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం 8.50గంటల సమయంలో రెస్టరెంట్ బేస్మెంట్‌లో మంటలు చెలరేగాయి. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.
#UPDATE | The death toll rises to 21 in Malviya Nagar restaurant fire incident, confirms Delhi Police.
— ANI (@ANI) June 3, 2026
#DELHI-साकेत प्रेस एन्क्लेव के सामने, मालवीय नगर के हौज रानी स्थित एक होटल में लगी भीषण आग ।
लाल डोरा क्षेत्र में तेजी से बन रहे बहुमंजिला होटलों की अग्नि सुरक्षा, आपातकालीन पहुंच और नियामक निगरानी पर गंभीर सवाल खड़े कर दिए हैं।#DelhiFire #MalviyaNagar #Saket #FireSafety pic.twitter.com/2gtCHzJfg9
— Payall Singhh (@PayallSingh13) June 3, 2026
ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ.. షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. మృతుల్లో.. సౌతాఫ్రికా, గల్ఫ్ వాసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.
మరోవైపు.. ఢిల్లీలోని మాలవీయ నగర్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు.
The loss of lives due to a fire incident in Malviya Nagar, Delhi is tragic. My condolences to those who have lost their loved ones. Wishing a speedy recovery to the injured. Authorities are providing all possible assistance to those affected.
An ex-gratia of Rs. 2 lakh from…
— PMO India (@PMOIndia) June 3, 2026
