Meerut Couple Divorce : హనీమూన్‌కు కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చిన భర్త.. విడాకులు ఇచ్చిన భార్య.. భర్త మాత్రం..

Meerut Couple Divorce : యూపీలోని మీరట్‌లో భార్యాభర్తల విచిత్రమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. హనీమూన్‌కు భార్యతోపాటు తన కుటుంబ సభ్యులను భర్త తీసుకెళ్లాడు. దీంతో హనీమూన్ నుంచి తిరిగొచ్చిన తరువాత భర్తకు భార్య విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

Meerut Couple Divorce

Meerut Couple Divorce : పెండ్లి తరువాత చిన్నచిన్న విషయాలకే భార్యాభర్తలు విడిపోతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సంతోషంగా ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు వివాహేతర సంబంధాలు, మరికొన్ని సార్లు ఇంటి పనుల నుండి స్వేచ్ఛ లభించకపోవడం వంటివి కుటుంబంలో గొడవలకు కారణం అవుతున్నాయి. తాజాగా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీటర్ లో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు పెళ్లి జరిగిన కొద్దిరోజులకు భార్యతో కలిసి హనీమూన్ కు ప్లాన్ చేశాడు. అయితే, ఆ హనీమూన్ కు తన కుటుంబ సభ్యులనుసైతం తోడు తీసుకురావడంతో భార్య ఆగ్రహంతో విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఘటన తరువాత పలుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా భార్యలో ఎలాంటి మార్పురాకపోవటంతో పెండ్లి జరిగిన కొద్దిరోజులకే భార్యాభర్తలు విడిపోతున్న పరిస్థితి నెలకొంది.

Also Read : Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరింత సులభంగా రైలు టికెట్.. ఆగస్టు నుంచి అమల్లోకి..

ఈ వివాహం ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా కుదిరింది. ఢిల్లీలోని రామ్‌రాజ్ ప్రాంతానికి చెందిన వధువు గ్రాడ్యుయేట్ కాగా.. యూపీలోని మీరట్‌లో పటేల్ నగర్ కు చెందిన వరుడు సింగపూర్‌లో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చదివినట్లు తెలిసింది. వీరిద్దరికీ తొలిసారిగా మ్యాట్రీమోని వెబ్‌సైట్‌లో పరిచయమైంది. కొద్దిరోజులకే వారిద్దరూ పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరూ పెండ్లితో ఒకటయ్యారు. కానీ, అత్తగారింటికి వచ్చిన తరువాత వధువులో తనకు స్వేచ్చ లేదనే భావన ఏర్పడింది.

పెండ్లి జరిగిన కొద్దిరోజుల తరువాత హనీమూన్ వెళ్లేందుకు భర్త ఏర్పాట్లు చేశారు. దీంతో వధువు కూడా సంతోష పడింది. అయితే, భర్త ఆమెకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. భార్యతోపాటు అతని అమ్మానాన్న, అన్న, వదినలను కూడా హనీమూన్ కు తీసుకొచ్చాడు. హనీమూన్ సమయంలో భర్తతో కలిసిఉండే పరిస్థితి లేకుండా పోవటంతో వధువు తీవ్ర అసహనానికి గురైంది. హనీమూన్ ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చాక వధూవరుల మధ్య గొడవ జరిగింది. ప్రతి విషయంలోనూ అత్తమామల జోక్యంతో విసిగిపోయిన వధువు.. తన భర్త నుండి నేరుగా విడాకులు కోరింది.

ప్రస్తుతం భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే, హనీమూన్ అనేది భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని బంధాన్ని బలోపేతం చేసుకునే ప్రత్యేక సమయమని, కానీ, అది కుటుంబ విహారయాత్రగా మారిపోయిందని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. భర్త మాత్రం.. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చాడు. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారనే వారిని వెంట తీసుకెళ్లానని, ఇందులో తప్పేమీ లేదని వాదించాడు. ఇప్పటికే మూడు దఫాల కౌన్సెలింగ్ జరిగినప్పటికీ ఇద్దరి మధ్య రాజీ కుదరలేదని అధికారులు తెలిపారు. పరిస్థితి మారకపోతే కేసు విడాకుల దిశగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.