Meta Apologises : ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో బ్లాక్.. మెటా క్షమాపణలు.. అసలు కారణం ఇదేనట

Meta Apologises PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోను తాత్కాలికంగా బ్లాక్ చేయడంపై మెటా క్షమాపణలు తెలిపింది.

Meta Apologises

Meta Apologises PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోను తాత్కాలికంగా బ్లాక్ చేయడంపై మెటా (Meta) క్షమాపణలు తెలిపింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్య కాదని, సాంకేతిక లోపం (Technical Glitch) కారణంగానే వీడియో కొద్దిసేపు అందుబాటులో లేకుండా పోయిందని సంస్థ వెల్లడించింది. అనంతరం వీడియోను తిరిగి పునరుద్ధరించినట్లు తెలిపింది.

Also Read : Amit Shah : టార్గెట్ అమిత్ షా..! అందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్..

ఇటీవల నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఆ వీడియోను వీక్షించేందుకు ప్రయత్నించిన పలువురికి అది బ్లాక్ అయినట్లు సందేశం కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ఘటనపై స్పందించిన మెటా ప్రతినిధి.. ఈ కంటెంట్ పొరపాటున తొలగించబడింది. లోపాన్ని గుర్తించిన వెంటనే వీడియోను పునరుద్ధరించాం. ఈ అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కూడా వివరణ కోరినట్లు సమాచారం. మెటా అధికారిని వివరణ కోసం పిలిచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన విద్యార్థి నిరసనల నేపథ్యాన్ని పురస్కరించుకుని, దేశంలోని ‘జీన్ జెడ్’ యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ ఈ ప్రసంగం చేశారు. పరీక్షా పేపర్ లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలను తీసుకురాబోతోందని ఆయన ఆ వీడియోలో స్పష్టమైన హామీ ఇచ్చారు. అలాగే పేపర్ లీకేజీ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. నిందితులకు కఠిన శిక్షలు ఖరారు చేసేలా, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ఉద్దేశించిన ముసాయిదా చట్టాన్ని త్వరలోనే కేంద్ర క్యాబినెట్ ముందు ఉంచి ఆ తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశ పెడతామని పేర్కొన్నారు.