odisha girl gangrape: బాలికపై పోలీసు, మీడియా సిబ్బందితో సహా 8 మంది గ్యాంగ్ రేప్

  • Publish Date - September 6, 2020 / 07:30 AM IST

Minor gangraped by 8 in Odisha : రెండు నెలల క్రితం భువనేశ్వర్ లో కోవిడ్ 19 లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వహించిన పోలీసు, మీడియా సిబ్బందితో సహా 8 మంది బాలికపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికంగా ఉన్న ఓ ప్రముఖ ఛానెల్ లో పని చేసే వారు, లాక్ డౌన్ సమయంలో ఇతర జిల్లా నుంచి వచ్చిన పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన వారిగా భావిస్తున్నారు.



తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఆగస్టు 30వ తేదీన తల్లి భువనేశ్వర్ లోని Mahila Police Station లో ఫిర్యాదు చేసినట్లు భువనేశ్వర్ డీసీపీ ఉమా శంకర్ తెలిపారు. మార్చి, ఏప్రిల్ నెలలో కుమార్తెపై పదే పదే సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించినట్లు వెల్లడించారాయన. ఇందులో ఎలక్ర్టానిక్ మీడియాకు చెందిన ఇద్దరు, ఇద్దరు సెక్యూర్టీ సిబ్బంది, ఒక పోలీసు అధికారి, అతని సహచరులున్నారని ఆమె తెలిపారన్నారు.

Infocity Police Station ప్రాంతంలో బాధిత కుటుంబం నివాసం ఉంటోందని, బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో గన్ తో బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఫిర్యాదులో తల్లి వెల్లడించిందన్నారు. బెదిరింపులకు పాల్పడడంతో అత్యాచారానికి సంబంధించిన విషయాన్ని కుటుంబసభ్యలతో చెప్పలేదని, కానీ తండ్రి ఇచ్చిన కౌన్సెలింగ్ తో దారుణ ఘటనను బాలిక వెల్లడించిందన్నారు.




తొలుత Infocity Police Station కు వెళ్లి కంప్లైట్ చేయడానికి వెళితే..అక్కడి నుంచి Mahila Police Stationకు పంపారు. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నట్లు, నిందితులను గుర్తించడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం జరిగిందని భువనేశ్వర్ డీసీపీ ఉమా శంకర్ అన్నారు. ఐపీసీ, ఫొక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. బాలికను వైద్య పరీక్షలకు పంపారు. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుని స్థానిక మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామన్నారు.

దీనిపై Juvenile Justice Board మాజీ సభ్యురాలు నమ్రతా చద్దా స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎంను కోరుతున్నట్లు వెల్లడించారు. అమ్మాయిల భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు, ఆడపిల్ల ఎక్కడ సురక్షితంగా ఉండాలన్నారు. వెంటనే బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా సహాయపడాలని, బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు.

ట్రెండింగ్ వార్తలు