Dress with live fish : ఆమె డ్రెస్సే ఒక అక్వేరియం.. బతికున్న చేపలతో క్యాట్ వాక్..

ఓ ఫ్యాషన్ షోలో మోడల్ వేసుకున్న లైవ్ ఫిష్ డ్రెస్ అద్దిరిపోయింది. అట్ ది సేమ్ టైం జంతు హక్కుల కార్యకర్తల ఆగ్రహానికి గురైంది. ఇంతకీ ఆ డ్రెస్ ప్రత్యేకత ఏంటి? చదవండి.

Dress with live fish

Dress with live fish : ఫ్యాషన్ షోలలో మోడల్స్ రకరకాల దుస్తులు ధరిస్తారు. ఓ మోడల్ ర్యాంప్ వాక్‌లో ధరించిన దుస్తులు ఆకర్షణీయంగా అనిపించినా వివాదాస్పదం కూడా అయ్యాయి. బతికున్న ఫిష్‌లతో డ్రెస్ డిజైన్ చేసారు. షాకయ్యారా? చదవండి.

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ తమ్ముడ్ని చూశారా..? నెటిజెన్స్ కామెంట్స్ వైరల్..!

ఫ్యాషన్, ఎంటర్టైన్ మెంట్ అంశాల్లో జంతువుల బొచ్చు, తోలు ఉపయోగించడంపై జంతు హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. కొంతకాలంగా వారు వీటిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో ఓ మోడల్ వేసుకున్న డ్రెస్ వివాదాస్పదమైంది. జంతు హక్కుల కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది.

మేక్ ఓవర్ బై ప్రీతి (ohsopretty_makeover and preethijerlin) అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ డిజైనర్ తయారు చేసిన లైవ్ ఫిష్ డ్రెస్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో లక్షలాదిమందిని ఆకర్షించింది. అయితే డ్రెస్ మధ్యలో చిన్న గ్లాస్ కంటైనర్లో చేపలను ఉంచడం ఆకర్షణీయంగా అనిపించినా వాటికి తగిన ప్రదేశంగా కనిపించకపోవడంపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Rashmika Mandanna : విమానంలో ఆ హీరోతో రష్మిక లిప్ కిస్.. ఫోటో వైరల్..

‘మీ క్రియేటివిటీ పట్ల గౌరవభావం ఉన్నా అవి జీవాలు అని మర్చిపోయారు. మీరు వాటిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మీరు తప్పు చేస్తున్నారు.. ఇలాంటివి ఆపండి’ అని..’అవి జీవించడానికి సరైన ఆక్సిజన్ అవసరం.. ఫ్యాషన్ కోసం వీటిని ఉపయోగించడం దయచేసి ఆపండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.