Monkey Funeral Feast: కోతి అంత్యక్రియల భోజనానికి 1500మంది, ఇద్దరి అరెస్టు
కోతి అంత్యక్రియలకు హాజరైన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. మధ్యప్రదేశ్ రాజ్‌ఘడ్ జిల్లాలోని దలుపురా గ్రామంలో డిసెంబర్ 29న కోతి అంత్యక్రియలు నిర్వహించారు.
- Subhan Ali Shaik
- Published On : January 11, 2022 / 03:48 PM IST
Monkey Funeral
Monkey Funeral Feast: కోతి అంత్యక్రియలకు హాజరైన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. మధ్యప్రదేశ్ రాజ్‌ఘడ్ జిల్లాలోని దలుపురా గ్రామంలో డిసెంబర్ 29న కోతి అంత్యక్రియలు నిర్వహించారు. పాడెపై కోతి శవాన్ని ఉంచి ఊరేగింపుగా తీసుకువచ్చి కొరివి పెట్టార. ఆ కార్యం పూర్తి చేసిన ఓ వ్యక్తి హిందూ సంప్రదాయం ప్రకారం.. గుండు గీయించుకున్నాడు.
నిజానికి ఆ కోతి గ్రామంలో ఎవ్వరికీ పెంపుడు జంతువు కాదు. అప్పుడప్పుడు ఆ ఊరికి వస్తుండేది. దేశంలోని పలు చోట్ల కోతిని హనుమంతుడితో సమానంగా పవిత్రంగా భావిస్తారు.
అంత్యక్రియలు పూర్తయిన తర్వాత గ్రామస్థులంతా డబ్బులు సేకరించి భోజన కార్యక్రమం కోసం కార్డులు ప్రింట్ చేసి పంచిపెట్టారు. ఆ భోజనాలకు దాదాపు 1500మంది హాజరైనట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా మగాళ్లు వడ్డిస్తుంటే మహిళలు భోజనం చేస్తూ ఉన్నారు.
ఇది కూడా చదవండి: వీవో ఐపీఎల్ బదులు టాటా ఐపీఎల్‌గా పేరు మార్పు
ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వ్యాప్తి అడ్డుకునేందుక గానూ అమల్లో ఉన్న 144సెక్షన్ ను బ్రేక్ చేశారని కొందరిపై కేసు నమోదైంది. అందులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు కూడా.
The residents of Dalupura village in Rajgarh district first held the funeral rites of a langur that died of the cold on 29th December with the chanting of hymns, now hosted a mass feast for more then 1,500 people as part of funerary rituals. pic.twitter.com/aLSOPMqOG6
— Anurag Dwary (@Anurag_Dwary) January 11, 2022
