Anant Ambani Pre Wedding : నేను అతనిలో నా తండ్రిని చూస్తున్నాను.. ముఖేశ్ అంబానీ ఎమోషనల్ స్పీచ్
ప్రీ- వెడ్డింగ్ వేడుకలో ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీని గుర్తు చేసుకున్నారు.
![Anant Ambani Pre Wedding : నేను అతనిలో నా తండ్రిని చూస్తున్నాను.. ముఖేశ్ అంబానీ ఎమోషనల్ స్పీచ్ Anant Ambani Pre Wedding : నేను అతనిలో నా తండ్రిని చూస్తున్నాను.. ముఖేశ్ అంబానీ ఎమోషనల్ స్పీచ్](https://10tv.in/wp-content/uploads/2024/03/Anant-Ambani-Pre-Wedding-1.jpg)
Anant Ambani Pre-Wedding
Mukesh Ambani Emotional Speech : ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్లోని జామ్నగర్లో అతిరథ మహారథుల సమక్షంలో వరుసగా మూడు రోజుల పాటు ప్రీ-వెడ్డింగ్ వేడుకులను జరుపుకుంటోంది అంబానీ ఫ్యామిలీ. ఈ ప్రీ – వెడ్డింగ్ వేడుకల్లో ప్రపంచంలోని పలు దేశాల ప్రముఖులతోపాటు భారతదేశంలోని వ్యాపారవేత్తలు, సినీతారలు, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. ఈ వేడుకలో ముఖేశ్ అంబానీ తన కొడుకు అనంత్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు అనంత్ లో అనంతమైన సామర్థ్యాన్ని, త్వరలో కాబోతున్న అతని వధువు రాధికా మర్చంట్ ను ప్రశంసించారు.
Also Read : Anant Ambani Pre-Wedding : చిన్నకొడుకు అనంత్ ఎమోషనల్ స్పీచ్.. ముఖేష్ అంబానీ తీవ్ర భావోద్వేగం.. వీడియో వైరల్!
కొడుకును తన తండ్రితో పోల్చిన ముఖేశ్..
ప్రీ- వెడ్డింగ్ వేడుకలో ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీని గుర్తు చేసుకున్నారు. కొడుకు అనంత్ ను తన తండ్రి ధీరూభాయ్ అంబానీతో పోల్చాడు. సంస్కృతంలో అనంత్ అంటే అంతంలేనిది, దాని అర్థం అనంతం. నేను అనంత్ ను చూసినప్పుడల్లా మా నాన్న ధీరూభాయ్ ని అతనిలో చూస్తాను అంటూ ముఖేశ్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. అనంత్ యొక్క అచెంచలమైన ధృడ నిశ్చయాన్నికొనియాడిన ముఖేశ్ అంబానీ… అనంత్ అతని తాతలా ఏదీ అసాధ్యం కాదు అనే వైఖరిని కలిగి ఉంటాడని చెప్పుకొచ్చారు.
అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ జోడీ గురించి మాట్లాడుతూ.. రాధికలో అనంత్ ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిని కనుగొన్నాడు. రాధిక అపారమైన సృజనాత్మక శక్తి కలిగిన మహిళ. ఆమె ప్రేమ, సంరక్షణ ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది. అనంత్ – రాధిక వివాహం స్వర్గంలో నిర్ణయించిందంటూ ముఖేశ్ అంబానీ కాబోయే వధూవరులను కొనియాడారు.