Anant Ambani Pre-Wedding : చిన్నకొడుకు అనంత్ ఎమోషనల్ స్పీచ్.. ముఖేష్ అంబానీ తీవ్ర భావోద్వేగం.. వీడియో వైరల్!

Anant ambani pre-wedding : అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల సందర్భంగా అనంత్ ఎమోషనల్ అయ్యారు. ఈ సమయంలో తన అనారోగ్య సమస్యల గురించి ప్రస్తావించగా.. ఆ మాటలకు ముఖేష్ అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Anant Ambani Pre-Wedding : చిన్నకొడుకు అనంత్ ఎమోషనల్ స్పీచ్.. ముఖేష్ అంబానీ తీవ్ర భావోద్వేగం.. వీడియో వైరల్!

Anant Ambani's Emotional Speech Moves Mukesh Ambani

Anant Ambani Emotional Speech : ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అతిరథ మహారథుల సమక్షంలో ప్రీ-వెడ్డింగ్ వేడుకులను జరుపుకుంటోంది అంబానీ ఫ్యామిలీ.

Read Also : Anant Ambani Pre-Wedding : ఆహా.. ఏమి రుచులు.. అంబానీ ఇంట పెళ్లంటే ఆ మాత్రం ఉంటుందిలే.. నోరూరించే 2500 స్పెషల్ వంటకాలు..!

ఈ వేడుకలకు హాజరయ్యేందుకు ప్రపంచ దేశాల నుంచి ఎందరో ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినీతారలు, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు తరలివస్తున్నారు. మార్చి 3 వరకు కొనసాగనున్న ఈ వేడుకల్లో ఇప్పటికే అనేక మంది సినీప్రముఖులు సందడి చేశారు. పాప్ సంచలనం సింగర్ రిహాన్నా ప్రత్యేక ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంది. ముఖేష్, నీతా అంబానీ దంపతులు కూడా ఒక హిందీ పాటకు నటించి అందరిని అబ్బురపరిచారు.

అతిథులను సైతం కదిలించిన అనంత్ మాటలు :
అంతా సంతోషంగా సాగుతుండగా చిన్న కుమారుడు అనంత్ అంబానీ మైక్ అందుకుని తన జీవితంలో ఎదురైన అనుభవాల గురించి ఎమోషనల్‌గా మాట్లాడాడు. అనంత్ మాటలకు తండ్రి ముఖేష్ కూడా ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ఒక్క అంబానీ ఫ్యామిలీ మాత్రమే కాదు.. అక్కడికి విచ్చేసిన అతిథులను సైతం అనంత్ మాటలు కదిలించాయి.

అనంత్ అనారోగ్య సమస్యల గురించి చెబుతున్నంత సేపు ముకేశ్ అంబానీ కంటతడి పెట్టుకున్నారు. ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా ఒక కొడుకు తండ్రే కదా.. అందుకే.. ఆయన చిన్న కొడుకు అనంత్ మాటలకు ముఖేష్ మనస్సు చలించిపోయింది. తన అనారోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నాడో అనంత్ చెప్పడంతో ముఖేష్ అంబానీ ఫుల్ ఎమోషనల్ అయ్యారు.

అమ్మకు జీవితాంతం రుణపడి ఉంటా :
‘నా పెళ్లి వేడుకలను గ్రాండ్‌గా జరిపేందుకు నా ఫ్యామిలీ ఎంతో కష్టపడుతోంది. నా సంతోషం కోసం మా అమ్మ ఎంతో చేసింది. రోజుకు 18 నుంచి 19 గంటల వరకు కష్టపడింది. నా పెళ్లి వేడుకలను ప్రత్యేకింగా చేసేందుకు కొన్ని నెలలుగా నా కుటంబమంతా నిద్రలేకుండా కష్టపడుతూనే ఉంది. అందరికి తెలిసిన విషయమే.. నా జీవితం ఏమి పూలపాన్పు కాదు.. చిన్నప్పటి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎన్నో కఠిన సవాళ్లను దాటాల్సి వచ్చింది.

Anant Ambani's Emotional Speech Moves Mukesh Ambani

Anant Ambani’s Emotional Speech

ఇలాంటి కష్టసమయాల్లో నా అమ్మానాన్న నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. నాకు బాధ తెలియకుండా చూసుకున్నారు. నాకు ఏమి కావాలో అన్ని చేశారు. నా పెళ్లి వేడుక ఇంత గ్రాండ్ గా జరుగుతుందంటే అందుకు మా అమ్మే కారణం. అమ్మ వల్లే ఇదంతా సాధ్యమైంది. అమ్మకు నేను జీవితాంతం రుణపడి ఉంటా..’ అంటూ అనంత్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఇదంతా విన్న ముఖేష్ అంబానీ సైతం బాగా ఎమోషనల్ అయిపోయారు. ఇప్పుడా ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఎంత కుబేరులైన ముఖేష్ అంబానీ ఒక బిడ్డకు తండ్రే కదా.. కొడుకు విషయంలో తల్లిదండ్రులుగా అందించిన సపోర్టు అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కష్టాలు అనేవి అందరికి సమానమేనని, అందులో ధనికులు, పేదవాళ్లు అనే భేదం ఉండదని అంటున్నారు. కష్టకాలంలో కొండత అండగా నిలిచే ఉండేవాళ్లు ఉండాలేగానీ ఎంత కష్టమైనా చాలా సులభంగా అధిగమించవచ్చునని అంటున్నారు.

Read Also : Anant Ambani Pre-Wedding : అనంత్‌-రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుక.. నా రెండు కోరికలివే.. నీతా అంబానీ స్పెషల్‌ వీడియో మెసేజ్‌..!