Anant Ambani Pre-Wedding : ఆహా.. ఏమి రుచులు.. అంబానీ ఇంట పెళ్లంటే ఆ మాత్రం ఉంటుందిలే.. నోరూరించే 2500 స్పెషల్ వంటకాలు..!

Anant Ambani Marriage : అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుక కోసం.. ఒకటి కాదు.. వంద కాదు.. ఏకంగా 2500 స్పెషల్ వంటకాలను అతిథుల కోసం తయారుచేస్తున్నారట..

Anant Ambani Pre-Wedding : ఆహా.. ఏమి రుచులు.. అంబానీ ఇంట పెళ్లంటే ఆ మాత్రం ఉంటుందిలే.. నోరూరించే 2500 స్పెషల్ వంటకాలు..!

Anant Ambani-Radhika Merchant pre-wedding: 2,500 dishes on menu

Anant Ambani Marriage : అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అపర కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి సంబంధించి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అనంత్, రాధికా మర్చంట్ వివాహం జరిగేది వచ్చే జూలైలో అయినప్పటికీ, ముందుగానే వివాహ వేడుకలు మొదలయ్యాయి. అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ మాత్రం ఆర్భాటం ఉండాల్సిందే అన్నట్టుగా చేస్తున్నారు అంబానీ.  మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా నిర్వహించనుంది. గుజరాత్ లోని జామ్‌నగ్ గ్రాండ్ రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్‌లో అనంత్, రాధికల ప్రీ-వెడ్డింగ్ వేడుక జరుగనుంది. జూలై 12న ముంబైలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.

Read Also : Blue Aadhaar Card : బాల (బ్లూ) ఆధార్ కార్డు అంటే ఏంటి? ఈ ప్రత్యేకమైన కార్డు ఐదేళ్ల లోపు పిల్లలకు ఎందుకు ముఖ్యమంటే?

2500 వంటకాలతో స్పెషల్ మెనూ :
అనంత్, రాధికా పెళ్లికి రానున్న గెస్టుల కోసం స్పెషల్ వంటకాలను సిద్ధం చేస్తున్నారట.. అంబానీ ఫ్యామిలీకి తగినట్టుగా ఎక్కడా కొంచెం తగ్గకుండా ముఖేశ్ అంబానీ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట.. అతిథుల కోసం ప్రత్యేకించి స్పెషల్ ఫుడ్ మెనూ కూడా ప్రిపేర్ చేస్తున్నారట.. మూడు రోజుల పాటు ఈ వేడుకలో ఒకటి కాదు.. వంద కాదు.. ఏకంగా 2,500 వంటకాలను చేయించనున్నారట.. అద్భుతమైన 2,500 విభిన్న వంటకాలు మెను అందించనున్నారు. అంతర్జాతీయంగా ప్రముఖులను విందుతో ఆకట్టుకునేందుకు విభిన్న రీతిలో వంటకాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నోరూరించే వంటకాలను రెడీ చేస్తున్నారట..

అంబానీ అతిథుల జాబితా ఇదిగో :
ఈ పెళ్లి వేడుకకు వందలాది మంది ప్రముఖులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ వ్యక్తులు, వ్యాపారవేత్తలు, గాయకులు, నటీనటులు, అథ్లెట్లు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు హాజరుకానున్నారు. అంబానీ అతిథుల జాబితాలో గౌతమ్ అదానీ, సునీల్ భారతీ మిట్టల్ వంటి ప్రముఖ బిలియనీర్లు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ వంటి క్రికెట్ దిగ్గజాలు ఉన్నారు. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వంటి అంతర్జాతీయ వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అదనంగా, హాలీవుడ్ పాప్ ఐకాన్ రిహన్నా, దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.

25మందికి పైగా చెఫ్ స్పెషల్ టీమ్ :
నివేదికల ప్రకారం.. పెళ్లి వేడుకల సందర్భంగా ఇండోర్ నుంచి జామ్‌నగర్‌కు 25 మందికి పైగా చెఫ్‌లతో కూడిన ప్రత్యేక బృందాన్ని విమానంలో రప్పించనున్నారు. ఇండోరి వంటకాలు, పార్సీ, థాయ్, మెక్సికన్, జపనీస్ వంటకాలతో సహా స్పెషల్ మెనూతో పాటు వివిధ రకాల పాన్-ఆసియన్ రుచికరమైన వంటకాలు ఉంటాయని జార్డిన్ హోటల్ డైరెక్టర్ మీడియా నివేదికలో తెలిపారు. విభిన్నమైన వంటలతో అతిథులను ఆకర్షించేలా ఉండనున్నాయి. బ్రేక్ ఫాస్ట్ విషయానికి వస్తే.. 70 కన్నా ఎక్కువ ఆప్షన్లలో అందించనున్నారు.

లంచ్, డిన్నర్, మిడ్ నైట్ స్నాక్స్ కూడా :
ఆ తర్వాత లంచ్, డిన్నర్ కోసం ఒక్కొక్కటి 250 రకాల వంటకాలు ఉంటాయి. అదనంగా, వెజిటేరియల్ అతిథులకు భోజనం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా, దాదాపు 85 అర్ధరాత్రి స్నాక్స్ కూడా (రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు) అతిథులకు అందుబాటులో ఉంటాయి. ఈ వేడుకలకు దాదాపు వెయ్యి మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. మూడు రోజుల పెళ్లి వేడుకల్లో అతిథులు వివిధ ఫంక్షన్‌లకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్క ఈవెంట్ ఆహ్వానితులకు అందించిన ‘ఈవెంట్ గైడ్’లో సూచించిన డ్రెస్ కోడ్‌తో అత్యంత ఆహ్లాదకరంగా ఉండనుంది.

ప్రీ-వెడ్డింగ్ కోసం అంబానీ ఫ్యామిలీ చేస్తున్న హడావుడిని చూసి..  చాలామంది.. ఇదే ఇలా ఉంటే.. అసలైన పెళ్లికి ఎంత ఆర్భాటం చేస్తారో కదా అంబానీ అని భోజన ప్రియులు అంటున్నారు. ఆహా.. ఏమి రుచులు.. తింటే మైమరిచి పోవాల్సిందేనని అంబానీ వెడ్డింగ్ స్పెషల్ మెనూ గురించి తెగ చర్చించుకుంటున్నారు.

Read Also : FASTag KYC Deadline : మీ ఫాస్ట్‌ ట్యాగ్ కేవైసీ అప్‌డేట్ చేశారా? ఈ నెల 29 వరకు ఛాన్స్.. ఎలా అప్‌డేట్ చేయాలి? స్టేటస్ ఇలా తెలుసుకోండి!