Modi Young Friend : ఒకే ఒక్క ఫోటోతో స్టార్ అయిపోయాడు.. ప్రధాని మోదీతో ఉన్న ఈ బుడ్డోడు ఎవరంటే..!
Modi Young Friend : ప్రధాని నరేంద్ర మోదీ తన ఇన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇంతకు మోదీ ఎత్తుకున్న ఆ చిన్నారి ఎవరంటే..
- Dharani Pilli
- Published On : March 22, 2026 / 03:00 PM IST
Narendra Modi shared a candid photograph with a young child in instagram went viral Sparks Buzz Online
Modi Young Friend : సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ప్రపంచాధినేతల్లో మన ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఆయనకు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇన్‌స్టాలో ఆయన ఒక్క పోస్ట్ చేస్తే చాలు నిమిషాల వ్యవధిలోనే వైరల్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా నరేంద్ర మోదీ చేసిన ఒక ఇన్‌స్టా పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన తక్కువ సమయంలోనే ఈ ఫోటోలకు 1.7 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది.
మోదీ ఓ చిన్న బాబును ఎత్తుకుని ఉన్న ఫోటోని షేర్ చేశారు. దీంతో పాటు “7, లోక్ కళ్యాణ్ మార్గ్ కి వచ్చిన నా లిటిల్ ఫ్రెండ్” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ ఫోటో నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయ్యింది. ఇంతకూ మోదీ ఎత్తుకున్న ఆ చిన్న బాబు ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోన్న ఈ ఫోటోలో ఉన్న చిన్నారి పేరు నియోమ్ అశ్విన్ కృష్ణ (Omy). అతను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దియా కృష్ణ కుమారుడు. అంతే కాదండోయ్.. కేరళకు చెందిన నటుడు, రాజకీయ నాయకుడు కృష్ణ కుమార్ మనవడు. కృష్ణ కుమార్ కుటుంబం ప్రధాని నివాసానికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు. ఇందులో పలువురు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఈ భేటీలో కృష్ణ కుమార్ భార్య సింధు కృష్ణకుమార్, కుమార్తెలు అహానా, దియా, ఇషాణి, హన్సిక, అలాగే అల్లుడు అశ్విన్ పాల్గొన్నారు. వీరంతా కలిసి దాదాపు ఒక గంట పాటు ప్రధానితో గడిపారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి కూడా వైరల్ అయ్యాయి.
మోదీ తన కుమారుడిని ఎత్తుకున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. దీనిని ఒక “ఫ్యాన్ మోమెంట్”గా అభివర్ణిస్తూ దియా కృష్ణన్ భావోద్వేగంగా పోస్ట్ చేశారు. “ఇది నా జీవితంలో అతి పెద్ద ఫ్యాన్ మోమెంట్!! మా ప్రియమైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీతో గడిపిన ఆ ఒక గంట ఇప్పటికీ కలలా అనిపిస్తోంది. నా కుటుంబంతో కలిసి మోదీతో గడిపిన ఈ రోజు మా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు” అని ఆమె పేర్కొన్నారు.
‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గడిపిన ఈ ఉదయం ఎంతో ప్రేరణాత్మకంగా అనిపించింది. ఆయన వంటి గొప్ప నాయకుడు మాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం చూసి నేను ఆశ్చర్యపోయాను. మేము అడిగిన చిన్న చిన్న ప్రశ్నలకు కూడా ఆయన ఎంతో ఓర్పుగా సమాధానాలు ఇచ్చారు. సాదాసీదా, నిజాయితీతో కూడిన సంభాషణలో పాల్గొన్నారు. ఒక సమయంలో మేము ప్రపంచంలో అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరితో మాట్లాడుతున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయాం’ అంటూ అహానా కృష్ణ చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
