Smriti irani: బీజేపీలో స్మతి ఇరానీ రిటర్న్స్?.. కొత్త బాధ్యతలు..!
రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాజీ కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీ(Smriti irani)లకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు జాతీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Smriti irani anurag thakur likely to join bjp national team under nitin nabin
- నబిన్ టీమ్‌లోకి స్మృతి, అనురాగ్
- యువత, మహిళలకే అత్యధిక ప్రాధాన్యం
- 2027 లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు
Smriti irani: భారతీయ జనతా పార్టీ జాతీయ పరివారంలో సరికొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్ తన నూతన వర్కింగ్ టీమ్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త వ్యూహాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కమిటీలో మాజీ కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీలకు(Smriti irani) కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు జాతీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అనుభవజ్ఞులతో పాటు నవతరం నాయకులను ప్రోత్సహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
యువత, మహిళలకు అగ్రతాంబూలం:
కేవలం 45 ఏళ్ల వయస్సులోనే అత్యంత పిన్న వయస్కుడైన బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్, తన కొత్త టీమ్ సగటు వయస్సు 50 ఏళ్లు ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రాంతీయ సమతుల్యతతో పాటు మహిళలకు, యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కమిటీని రూపొందిస్తున్నారు. గతంలో సమాచార, క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్, అమేథీ మాజీ ఎంపీ స్మృతి ఇరానీల రీ-ఎంట్రీతో పార్టీ జాతీయ స్థాయిలో మరింత ఆకర్షణీయంగా మారనుందని విశ్లేషిస్తున్నారు.
భవిష్యత్ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు:
ఉత్తరప్రదేశ్ ఎంపీలతో ఇప్పటికే వన్-టు-వన్ సమావేశాలు పూర్తి చేసిన నబిన్, క్షేత్రస్థాయి సమీకరణాలు, కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పాత-కొత్త నాయకుల కలయికతో రూపొందుతున్న ఈ నూతన ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, రాబోయే ఎన్నికల సమరానికి బీజేపీని సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. జాతీయ స్థాయిలో రాబోతున్న ఈ మార్పులు భారత రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
