ఝార్ఖండ్ సీఎంపై అత్యాచార ఆరోపణలు..రంగంలోకి మహిళా కమిషన్
- venkaiahnaidu
- Updated on- December 17, 2020 / 09:43 PM IST
Jharkhand CM ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై ముంబైకి చెందిన ఓ మోడల్ చేసిన అత్యాచార ఆరోపణలను సుమోటోగా స్వీకరించింది జాతీయ మహిళా కమిషన్. 2013లో నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. సామాజిక మాధ్యమాల్లో మోడల్ పేరిట ఓ లేఖ వైరల్గా మారిన మరుసటి రోజునే జాతీయ మహిళా కమిషన్ ఈ మేరకు స్పందించటం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, 2013లో హేమంత్ సోరేన్,సురేష్ నాగ్రే తనపై అత్యాచారం చేశారని,అంతేకాకుండా తన తల్లిదండ్రులను కూడా బెదిరిస్తున్నారంటూ ముంబైకి చెందిన ఓ మోడల్ ఆరోపణలు చేసినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ అంశం వైరల్గా మారింది. పోలీసుల భద్రత కోరుతూ మోడల్ రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
మీడియా రిపోర్టులను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. ఈ మేరకు 2013లో నమోదైన కేసుపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఎన్సీడబ్ల్యూ ఛైర్పర్సన్ రేఖా శర్మ మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు ఎన్సీడబ్ల్యూ ఛైర్పర్సన్ రేఖా శర్మ. కాగా, ఈ ఏడాది జులైలో గొడ్డా ఎంపీ నిశికాంత్ దుబే ఈ అంశాన్ని లేవనెత్తారు. అత్యాచార కేసును తిరిగి పునర్విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
