మహారాష్ట్ర అసెంబ్లీలో సగానికి పైగా నేరస్తులే

  • Publish Date - October 27, 2019 / 02:12 AM IST

మహారాష్ట్ర  శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యుల్లో 176 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు  ప్రజాస్వామ్య సంస్కరణల వేదిక తెలిపింది. మొత్తం 288 మంది సభ్యులు సమర్పించిన నామినేషన్ పత్రాలు విశ్లేషించి ఈ నివేదిక రూపోందించారు. ఎన్నికల కమీషన్ వెబ్ సైట్ అందుబాటులో లేనందున మరో ముగ్గురి నామినేషన్ పత్రాలను విశ్లేషించలేక పోయినట్లు  ఆ నివేదికలో వివిరించారు. 

2019 లో ఎన్నికైన ఎమ్మెల్యేలలో176 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కోంటున్నవారు ఉన్నారు. వీరిలో 113 మంది పై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి.  ఈదఫా ఎన్నికైన అభ్యర్ధుల్లో 118 మంది గత శాసన సభ లోనూ సభ్యులుగా ఉన్నావారే ఎన్నికయ్యారు.  264 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా అఫిడవిట్ సమర్పించారు.

2014 కంటే 2019 లో నోటా ఓట్ల సంఖ్య 0.44 శాతం పెరిగింది. 23 నియోజక వర్గాల్లో ఎన్నికైన ఎన్సీపీ,కాంగ్రెస్  అభ్యర్దుల ఆధిక్యం కంటే ఆయా చోట్ల నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ ఉన్నాయి.