NEET PG 2026: నీట్ పీజీ 2026 అభ్యర్థులకు అలర్ట్.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలు.. ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది

నీట్ పీజీ (NEET PG 2026) అభ్యర్థులు జులై 21 వరకు రిజస్ట్రేషన్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

NEET PG 2026 application process has begun from july 1st

  • నీట్ పీజీ షెడ్యూల్ విడుదల.

  • ఆగస్టు ముప్పై న పరీక్ష.

  • జులై ఇరవై ఒకటి వరకు గడువు.

NEET PG 2026: వైద్య విద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయస్థాయి అర్హత పరీక్ష (NEET PG 2026) తేదీలను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్ సైన్సెస్‌ (NBEMS) ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 30న దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

Jupally Krishna Rao: మీ ఆఫీసుకొస్తా.. తేల్చుకుందామా.? కేటీఆర్ కు జూపల్లి సవాల్

ఈ రోజే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, అభ్యర్థులు జులై 21 వరకు రిజస్ట్రేషన్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష రాసే అభ్యర్థులకు వీలుగా, వారికి కేటాయించిన పరీక్ష కేంద్రానికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ఆగస్టు 11వ తేదీనే వెల్లడిస్తామని ఎన్‌బీఈఎంఎస్‌ స్పష్టం చేసింది. ఇక పరీక్ష ముగిసిన అనంతరం, సరిగ్గా నెల రోజులకు అంటే సెప్టెంబర్‌ 30 నాటికి ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హులైన వైద్య విద్యార్థులు గడువులోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.