New Aadhaar Rules: హోటల్స్ లో ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారా? ఇకపై అవసరం లేదు.. రూల్స్ మారిపోయాయి
హోటళ్లలో చెక్-ఇన్ సమయంలో గుర్తింపు కార్డుగా ఆధార్(New Aadhaar Rules) జిరాక్స్ కాపీలు ఇవ్వడం ఇప్పటివరకు తప్పనిసరిగా ఉండేది.
- V Santhosh Kumar
- Published on- August 26, 2026 / 09:50 PM IST
New aadhaar rules for hotel check in no physical copy needed
- హోటల్ చెక్-ఇన్ రూల్స్
- క్యూఆర్, ఓటీపీ డిజిటల్ ధృవీకరణ
- వ్యక్తిగత డేటాకు పూర్తి రక్షణ
New Aadhaar Rules: విహారయాత్రలు లేదా వ్యాపార పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటళ్లలో బస చేయడం సహజం. అయితే చెక్-ఇన్ సమయంలో గుర్తింపు కార్డుగా ఆధార్ జిరాక్స్ కాపీలు ఇవ్వడం ఇప్పటివరకు తప్పనిసరిగా ఉండేది. ఈ విధానం వల్ల హోటల్ ప్రవేశం ఆలస్యం కావడమే కాకుండా, మన వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. వినియోగదారుల భద్రత, గోప్యతను దృష్టిలో ఉంచుకుని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఈ పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ నూతన డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
Telangana Govt: తెలంగాణా మహిళల కోసం కొత్త పథకం.. ఉచితంగా పంపిణీ.. మీరు దరఖాస్తు చేసుకున్నారా?
క్యూఆర్ కోడ్, ఓటీపీతో సులువైన ధృవీకరణ:
నూతన నిబంధనల ప్రకారం హోటల్ చెక్-ఇన్ ప్రక్రియ కోసం ఫిజికల్ ఆధార్ కాపీలను సమర్పించాల్సిన పనిలేదు. UIDAI(New Aadhaar Rules) తీసుకొచ్చిన కొత్త యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా ఓటీపీ ద్వారా మీ గుర్తింపును క్షణాల్లో ధృవీకరించుకోవచ్చు. డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడంతో పాటు ప్రయాణికులకు చెక్-ఇన్ ప్రక్రియను అత్యంత సులభతరం చేసేందుకు ఈ అధునాతన విధానం ఎంతో దోహదపడుతుంది.
డేటా గోప్యత – మోసాలకు అడ్డుకట్ట:
గతంలో ఇచ్చిన జిరాక్స్ ప్రతుల ద్వారా మన ఆధార్ వివరాలు మోసగాళ్ల చేతికి చిక్కి దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉండేది. కొత్త డిజిటల్ ఫీచర్ ద్వారా మన డేటాకు పూర్తి రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా, ఈ యాప్ సహాయంతో మనం ఏ వివరాలైతే హోటల్ యాజమాన్యంతో పంచుకోవాలనుకుంటున్నామో వాటిని మాత్రమే షేర్ చేసే వెసులుబాటు కలగడం విశేషం.
