E20 Petrol Price: ఇథనాల్ కలపకపోతే పెట్రోల్ లీటర్ ఎంతయ్యేదో తెలుసా.. పార్లమెంట్ లో లెక్కలు రాసిచ్చిన ప్రభుత్వం..
E20 Petrol Price; ఇథనాల్ కలిపిన పెట్రోల్ మీద దేశంలో కొన్నిచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ20 పెట్రోల్ మీద తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీద నెటిజన్లు బీభత్సంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
- Shiva
- Updated on- July 30, 2026 / 05:03 PM IST
nitin gadkari Clarifies without e20 ethanol petrol price would be Rs 125
E20 Petrol Price: ఇథనాల్ కలిపిన పెట్రోల్ మీద దేశంలో కొన్నిచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ20 పెట్రోల్ మీద తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీద నెటిజన్లు బీభత్సంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే, ఇథనాల్ కలపకపోతే పెట్రోల్ లీటర్ ఎంత అయ్యేదనే అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపకపోతే క్లీన్ పెట్రోల్ ధర లీటర్ కు రూ.125 అయ్యేదని తెలిపింది.
‘దేశంలో 23 కోట్ల వాహనాలు ఉన్నాయి. అందులో 20 కోట్ల టూవీలర్స్, 3 కోట్ల ఫోర్ వీలర్స్ ఉన్నాయి. అవన్నీ ఈ15 లేదా ఈ20 పెట్రోల్ తోనే రెండున్నరేళ్లుగా నడుస్తున్నాయి. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ఇంజిన్ సమస్య వస్తుందనేది ఎక్కడా నిరూపితం కాలేదు. కేవలం అపోహ, ప్రచారం మాత్రమే.’ అని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
Also Read: అక్కడి విద్యార్థులకు గుడ్ న్యూస్.. మధ్యాహ్న భోజనంలో చికెన్ బిర్యానీ.. ఎప్పటి నుంచంటే..
కేంద్ర ప్రభుత్వం తమ వాదనకు బలం చేకూర్చేలా కొన్ని పత్రాలను కూడా లోక్ సభలో ప్రవేశపెట్టింది. కార్లు, బైక్ కంపెనీలు సర్వీసింగ్ సెంటర్ల నుంచి తీసుకున్న ఈ డేటా ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2.84 కోట్ల వాహనాలను సర్వీసింగ్ చేశారు. అందులో 1.5 కోట్ల వాహనాలు పాతవే. ఆ కార్లు, బైక్స్ లో ఎక్కడా కూడా ఈ20 వాడకం వల్ల మైలేజ్ ఇష్యూని వాళ్లు గుర్తించలేదు. ఇంజిన్ దెబ్బతింటుందనడానికి ఆనవాళ్లు లేవని చెప్పింది.
ఇక ఈ మధ్య జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంథన దిగుమతులకు సంబంధించి సమస్యలు తలెత్తినా కూడా ప్రభుత్వం వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగిందని గడ్కరీ అన్నారు. ఇథనాల్ మిక్స్ చేయడం వల్ల పెట్రోల్ దిగుమతి అనేది కొంత తగ్గించుకోగలిగామని చెప్పారు.
