Petrol Diesel Rate : పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు
శనివారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.. జులై 17వ తేదీ చివరి సారి పెరిగాయి పెట్రోల్ ధరలు. అప్పటి నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి.
- kunduru Vinod
- Updated on- August 21, 2021 / 10:19 AM IST
Petrol Rate
Petrol Diesel Rate : శనివారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.. జులై 17వ తేదీ చివరి సారి పెరిగాయి పెట్రోల్ ధరలు. అప్పటి నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. డీజిల్ ధరలు మాత్రం బుధ, గురు, శుక్రవారాల్లో స్వల్పంగా తగ్గాయి. శనివారం డీజిల్ ధరలో కూడా ఎటువంటి మార్పు లేదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. నేడు స్థిరంగా ఉన్నాయి.
చివరిసారి లీటర్ పెట్రోల్ పైన 30 పైసలు పెరిగింది. గత నెలలో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. ఈ ఆగస్ట్ నెలలో ఇప్పటి వరకు పెట్రోల్ ఒక్కసారీ పెరగలేదు. డీజిల్ ధరలు మాత్రం వరుసగా మూడు రోజులు తగ్గాయి.
- ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.84, లీటర్ డీజిల్ రూ.89.27గా ఉంది.
- ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.83, డీజిల్ రూ.97.04గా ఉంది.
- మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి.
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.83, లీటర్ డీజిల్ రూ.97.33గా ఉంది.
