Modi Cartoon : పాములు పట్టే వ్యక్తిగా మోదీ కార్టూన్… నార్వే పత్రికపై భారీ స్థాయిలో ట్రోలింగ్

Modi Cartoon : నార్వే పత్రిక ఒకటి ప్రధాని నరేంద్ర మోదీపై జాత్యంహకార కార్టూన్ ప్రచురించి విమర్శల పాలవుతుంది.

Norwegian papers cartoon of PM Modi as snake charmer sparks backlash

  • మోదీపై నార్వే పత్రిక జాత్యంహకార కార్టూన్
  • పాములు పట్టేవాడిగా మోదీ కార్టూన్
  • భారీ స్టాయిలో ట్రోలింగ్

Modi Cartoon : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోదీపై ఓ నార్వే పత్రిక విషం కక్కింది. భారత ప్రధానిపై జాత్యహంకార కార్టూన్‌ను ప్రచురించింది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారగా.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. సదరు పత్రిక ఈ కార్టూన్ లో మోదీని ఒక పాములు పట్టే వ్యక్తిలా చూపించింది. దీనికి ఒక తెలివైన విసిగించే వ్యక్తి అనే క్యాప్షన్ ఇచ్చింది. నార్వేకు చెందిన Aftenposten అనే పత్రిక ఈ కార్టూన్‌ను ప్రచురించింది.

పైగా ఈ సందర్భంగా రాసిన వ్యాసంలో సదరు పత్రిక ఇండియా విదేశాంగ విధానంపై కూడా అక్కసు వెళ్లగక్కింది. మోదీ నార్వే పర్యటనకు ముందే ఇది ప్రచురించినట్లు తెలుస్తోంది. ప్రధాని ఓస్లో పర్యటన సమయంలోనే ఇది బయటకు వచ్చింది. ఈ కార్టూన్‌ సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ‘ఈ కార్టూన్‌ పూర్తిగా జాత్యహంకారంతో కూడుకున్నది’ అని ఒకరు కామెంట్‌ చేశారు.

ఇదిలా ఉంటే ఇండియాలో మీడియా స్వేచ్ఛపై తాను అడిగిన ప్రశ్నకు.. ప్రధాని నరేంద్ర మోదీ బదులివ్వలేదంటూ కలకలం రేపిన నార్వే మహిళా జర్నలిస్ట్ హెలె లెంగ్‌ స్వెండ్సన్ కి షాక్ తగిలింది. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్‌ని బ్యాన్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా హెలె లెంగ్ స్వెండ్సన్ నే వెల్లడించారు. తన ఇన్‌స్టా, ఫేస్‌‌బుక్ అకౌంట్స్‌ సస్పెన్షన్‌కు గురైనట్టు ఆమె ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.

*తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం.. అలా చేస్తే లక్ష బహుమతి.. అదిరిపోయే ఆఫర్

దీనితో పాటు పత్రికా స్వేచ్ఛ కోసం తాను ఈ చిన్న మూల్యాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ రాసుకొచ్చారు. గతంలో తనకు ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవం ఎదురు కాలేదన్నారు. తన అకౌంట్స్ సస్పెన్షన్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘నేను ఇండియన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనుకున్నాను. కానీ ఇప్పుడు నా సోషల్ మీడియా ఖాతాలు బ్యాన్ చేశారు. అందుకే వారితో మాట్లాడటానికి కాస్త ఆలస్యం కావొచ్చు. త్వరలోనే నా సోషల్ మీడియా అకౌంట్స్‌పై సస్పెన్షన్‌ను ఎత్తేస్తారనే ఆశిస్తున్నా’ అని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు.

*నెలకు రూ.40 లక్షల భరణం ఇస్తే విడాకులకు ఓకే.. జయం రవి భార్య డిమాండ్..

నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌తో కలిసి సంయుక్త ప్రకటన అనంతరం ప్రధాని మోదీ తిరిగి వెళుతున్న సమయంలో స్వెండ్సన్ ప్రధాని మోదీని మీడియా స్వేచ్ఛపై ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అయితే, ప్రధాని మోదీ మాత్రం నార్వే ప్రధానితో కలిసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్‌లో పోస్టు చేస్తూ తన ప్రశ్నకు బదులేదని ప్రశ్నించారు.