పెళ్లి గిప్ట్ చూసి షాక్ తిన్న కొత్తజంట

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. చరిత్రలో ఫస్ట్ టైమ్ ఉల్లి ధరలు రికార్డ్ స్థాయికి వెళ్లాయి. డబుల్ సెంచరీకి చేరువలో ఆనియన్ ధరలు ఉన్నాయి. విపరీతంగా

  • Publish Date - December 8, 2019 / 10:46 AM IST

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. చరిత్రలో ఫస్ట్ టైమ్ ఉల్లి ధరలు రికార్డ్ స్థాయికి వెళ్లాయి. డబుల్ సెంచరీకి చేరువలో ఆనియన్ ధరలు ఉన్నాయి. విపరీతంగా

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. చరిత్రలో ఫస్ట్ టైమ్ ఉల్లి ధరలు రికార్డ్ స్థాయికి వెళ్లాయి. డబుల్ సెంచరీకి చేరువలో ఆనియన్ ధరలు ఉన్నాయి. విపరీతంగా పెరిగిన ఉల్లిపాయల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పలు రూపాల్లో తమ నిరసన తెలుపుతున్నారు. సెటైర్లు వేస్తున్నారు. కొంతమంది ఉల్లిని బంగారంతో పోలుస్తున్నారు. మరికొందరు వినూత్నంగా కానుకల రూపంలో ఉల్లిని ఇస్తున్నారు. 

తాజాగా బెంగళూరులో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ జంట వివాహంలో ఉల్లిపాయలు పెళ్లి కానుక అయ్యాయి. పెళ్లి కొడుకు స్నేహితులు 2 కిలోల ఉల్లిని(కిలో రూ.150) కొనుగోలు చేసిన కొత్తజంటకు గిఫ్ట్ గా ఇచ్చారు. గిఫ్ట్ ఏంటా అని ఓపెన్ చేసి చూసిన వధూవరులు షాక్ తిన్నారు. అందులో ఉల్లిపాయలు ఉండటం చూసి సరదాగా నవ్వుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫన్నీగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉల్లిపాయలు బంగారమైపోయాయని.. ఇది చాలా కాస్ట్లీ గిఫ్ట్ అని మరికొందరు కామెంట్ చేశారు.