లోకసభలో ప్రణబ్‌కు సంతాపం.. ఈసారి వేర్వేరుగా సమావేశాలు

  • Publish Date - September 14, 2020 / 09:42 AM IST

భారత్‌లో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ… దేశంలోని ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం (సెప్టెంబర్ 14) ప్రారంభమయ్యాయి. కోవిడ్‌ -19 ప్రత్యేక పరిస్థితుల మధ్య… పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. సభకు హాజరయ్యే ఎంపీలకు కరోనా సోకకుండా పార్లమెంట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి.



https://10tv.in/parliament-monsoon-sessions-to-be-started-from-today-no-question-over-first-time-in-parliament-history/
మరోవైపు అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సమావేశాలకు రెడీ అయ్యాయి. ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లోకసభ సంతాపం తెలిపింది. ఉదయం రాజ్యసభ, మధ్యాహ్నం లోక్ సభలో సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో భారత చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన, కరోనా మహమ్మారి, ఢిల్లీ అల్లర్లకు సంబంధించి చర్చతోపాటు ఇతర అంశాలపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.



ఇవాళ్టి నుంచి అక్టోబర్‌ ఫస్ట్‌ వరకు అంటే.. 18 రోజులపాటు ఏకధాటిగా కొనసాగనున్నాయి. ఎలాంటి సెలవు దినాలు లేకుండా ఆదివారం కూడా సభ జరుగనుంది. కరోనా నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌ సభ వేర్వేరు సమయాల్లో జరగనున్నాయి. లోకసభ సమావేశాలు తొలిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. మిగతా రోజులు, మధ్యాహన్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతాయి.



ఇక రాజ్యసభ సమావేశౄలు తొలిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది. మిగతా రోజుల్లో మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయి. మొత్తం 23 కొత్త బిల్లుల్లో 11 బిల్లులకు సంబంధించి ఆర్డినెన్స్ వంటి అంశాలపై చర్చించనున్నారు.