PM Modi – Rahul Gandhi : పార్లమెంట్ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం.. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ముచ్చట్లు.. వీడియో వైరల్
PM Modi-Rahul Gandhi : పార్లమెంట్ ఆవరణలో శనివారం ఉదయం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
- Harish Thanniru
- Updated on- April 11, 2026 / 12:56 PM IST
PM Modi-Rahul Gandhi
- పార్లమెంట్ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం
- జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా మోదీ, రాహుల్ నివాళి
- రాహుల్‌తో కొంతసేపు ముచ్చటించిన ప్రధాని మోదీ
PM Modi – Rahul Gandhi : పార్లమెంట్ ఆవరణలో శనివారం ఉదయం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడూ రాజకీయంగా విమర్శలు చేసుకుంటూ.. ఒకరిపైఒకరు మాటలతో దాడిచేసుకునే ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సరదాగా కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ పూలే 200వ జయంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణంలో ప్రేణ్ స్థల్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలు నివాళులర్పించారు. అంతకుముందు పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. అప్పటికే అక్కడున్న లోక్ సభ స్పీకర్ ఓం బిల్లా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, జగత్ ప్రకాష్ నడ్డా, మాజీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ లు ఉన్నారు. వారికి నమస్కరిస్తు ముందుకెళ్లిన మోదీ.. మళ్లీ వెనక్కి వచ్చి రాహుల్ గాంధీతో ముచ్చటించారు. వీరిద్దరూ కొద్దిసేపు పలు అంశాలపై ముచ్చటించుకున్నారు
రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. నివాళి వేదికపై ఇద్దరు నేతలు పరస్పరం మాట్లాడుకోవడం, స్నేహపూర్వకంగా పలుకరించుకోవటం అక్కడి వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
