India Bloc Protests: ఢిల్లీ వీధుల్లో విపక్షాల ధర్నా.. పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక.. మరో 50 మంది ఎంపీల అరెస్ట్

రాహుల్ గాంధీ(India Bloc Protests) సహా 50 మంది ఎంపీలు, మొత్తం 250 మంది నేతలను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Police detained Rahul Gandhi and Priyanka Gandhi at INDIA alliance protest.

India Bloc Protests: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం ఉదయం పార్లమెంట్ మకర ద్వారం నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వైపు విపక్ష ఎంపీలు భారీ ర్యాలీగా బయలుదేరారు.

Cm Revanth Reddy: ఆ 45 ఎకరాల భూమి ఏమైంది? ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!

ఆకాశవాణి భవన్ వద్ద ఉద్రిక్తత.. బారికేడ్లపైకి ఎక్కిన రాహుల్ గాంధీ:

ర్యాలీగా వెళ్తున్న ఎంపీలను ఆకాశవాణి భవన్ వద్ద పోలీసులు బారికేడ్లతో(India Bloc Protests) అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ బారికేడ్లపైకి ఎక్కి జాతీయ జెండా ఊపుతూ నిరసన తెలపగా, అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేడాతో పాటు పలువురు నేతలు దాదాపు తొమ్మిది గంటల పాటు ఆకాశవాణి భవన్‌లోనే బైఠాయించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ సహా 50 మంది ఎంపీలు, మొత్తం 250 మంది నేతలను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముందస్తు అపాయింట్‌మెంట్ లేదు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం:

మరోవైపు విపక్ష నేతల ఆందోళనల నడుమ రాజకీయ పార్టీలతో భేటీ వార్తలపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి ప్రతినిధులు తమతో సమావేశమవడానికి సాయంత్రం 4 గంటల వరకు ఎలాంటి సమయం కోరలేదని ఈసీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 4 గంటల తర్వాతే రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఎంపీల బృందం కలవాలనుకుంటున్నట్లు సమాచారం అందిందని, నిబంధనల ప్రకారం అధికార ప్రతినిధి ద్వారా ముందస్తు అపాయింట్‌మెంట్ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించిన తర్వాతే సమయం ఖరారవుతుందని ఈసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.