Aircraft Crash : దారుణ విమాన ప్రమాదం.. కొండ ప్రాంతంలో కూలిన ప్రైవేట్ జెట్.. ఎగసిపడుతున్న మంటలు

Aircraft Crash : దారుణ విమాన ప్రమాదం వెలుగు చూసింది. ప్రైవేట్ జెట్ కుప్పకూలింది.

Private jet crashes into hillside in Chhattisgarh

Aircraft Crash : ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం కోసం గాల్లోకి టేకాఫ్ అయిన ఓ ప్రైవేట్ జెట్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ దారుణ విమాన ప్రమాదం ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సోమవారం నాడు ప్రయాణికులతో టేకాఫ్ అయిన ఒక ప్రైవేట్ విమానం.. జష్‌పూర్-నారాయణ్‌పూర్ ప్రాంతంలో కొండను ఢీకొట్టి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ మరణించినట్లు అనుమానిస్తున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రైవేట్ జెట్ అటవీ ప్రాంతంలోని ఒక చెట్టును ఢీకొన్న తర్వాత కిందకు పడిపోయింది. జష్‌పూర్-నారాయణ్‌పూర్ సరిహద్దులోని కొండపై కూలిన విమానం నుండి దట్టమైన పొగ మరియు మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు ఘటనా స్థలంలో కనిపించాయి. ప్రమాదానికి గురైన ఆ విమానంలో మొత్తం ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు? వారిలో ఎందరు మరణించారు, ఎందరు గాయపడ్డారు? అనే వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.