డేటింగ్ యాప్‌లో కలిసిన యువతికి ఆల్కహాల్ తాగించి రేప్
- Subhan Ali Shaik
- Published On : December 29, 2020 / 08:33 AM IST
Online Dating App: ఆన్‌లైన్ డేటింగ్ యాప్ టిండర్ లో కలిసిన యువతిపై రేప్ కు పాల్పడ్డాడో వ్యక్తి. పూణెలో ఈ ఘటన జరిగింది. 26సంవత్సరాల అభిజిత్ వాగ్ అనే వ్యక్తిని పింపిరి చించ్‌వాడ్ పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 26న పూణెలోని హింజెవాడీలోని హోటల్ లో మహిళను కలిశాడు. బలవంతంగా ఆమెతో ఆల్కహాల్ తాగించాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లి రేప్ కు పాల్పడ్డాడు.
బాధితురాలు తాను ఇచ్చిన కంప్లైంట్ లో.. తన ప్రమేయం లేకుండానే క్లోజ్ అవడానికి ప్రయత్నించాడు. దానికి అంగీకరించకపోవడంతో గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత షూస్ తో చాలా సార్లు కొట్టాడు. బలవంతంగా ఆమెపై అటాక్ చేసి రేప్ కు పాల్పడ్డాడు అని పేర్కొంది.
ఈ ఘటన డిసెంబర్ 26న సాయంత్రం 4నుంచి రాత్రి 11గంటల 30నిమిషాల మధ్యలో జరిగినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. నిందితుడ్ని కోర్టు ముందు హాజరుపరుస్తామని జనవరి 2వరకూ అతను పోలీస్ రిమాండ్ లోనే ఉంటాడని మరికొంత విచారణ చేయాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. డిసెంబర్ 25నే ఆ మహిళ ఆన్ లైన్ లో అతణ్ని కలిసినట్లు ఆమె చెప్పింది.
