Pythons Found in Apartment : ఆ కుర్రాడి ఫ్లాట్‌కి రోజూ కొత్తోళ్లు వస్తున్నారు.. కిలోలు కిలోలు మాంసం తెస్తున్నారు.. ఏంటా అని చెక్ చేస్తే..
Pythons Found in Apartment : కర్ణాటక రాజధాని బెంగళూరులోని కామాక్షిపాళ్య ప్రాంతం అపార్ట్‌మెంట్‌లోని తన ప్లాట్‌లో ఓ యువకుడు కొండచిలువను పెంచుకుంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
- Harish Thanniru
- Updated on- July 5, 2026 / 01:29 PM IST
Pythons Found in Apartment
Pythons Found in Apartment : మన ఇంట్లోకి చిన్నపాటి పాము వస్తేనే భయంతో వణికిపోతాం.. కానీ, ఓ యువకుడు తన అపార్టుమెంట్ ప్లాట్‌లో ఏకంగా కొండచిలువను పెంచుకుంటున్నాడు. అయితే, ఆ యువకుడు ఉంటున్న అపార్టుమెంట్‌లోకి కొద్దిరోజులుగా అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు వచ్చి వెళ్తుండటాన్ని స్థానికులు గమనించారు. అంతేకాదు.. పెద్దమొత్తంలో మాంసాన్ని లోపలికి తీసుకెళ్తున్నారు. దీంతో ఆ ఇంట్లో ఏదో జరుగుతోందని స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్లాటులో తనిఖీలు చేపట్టగా కొండచిలువ ఉన్నట్లు గుర్తించారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కామాక్షిపాళ్య ప్రాంతం అపార్ట్‌మెంట్‌లోని తన ప్లాట్‌లో ఓ యువకుడు కొండచిలువను పెంచుకుంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీకి చెందిన ఓ యువకుడు కొంతకాలంగా పెద్ద అట్టపెట్టెలో కొండచిలువను పెంచుతున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ యువకుడి ప్లాటులో తనిఖీలు చేయగా.. అట్టపెట్టెలో కొండచిలువ ఉన్నట్లు గుర్తించారు. దీంతో సదరు యువకుడితోపాటు అతడితో సంబంధం ఉన్న మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొండచిలును ఎందుకు పెంచుతున్నారో తెలుసుకునేందుకు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
పోలీసుల విచారణలో సదరు యువకుడు కీలక విషయాలు వెల్లడించాడు. సోషల్ మీడియాలో ఓ రీల్ చూసి పాము యజమానిని సంప్రదించానని, అతని వద్ద మూడు బాల్ పైథాన్‌లు ఉండగా వాటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకున్నానని తెలిపాడు. అనంతరం ఆ పామును ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ద్వారా తన ఇంటికే పంపించారని చెప్పినట్లు తెలిసింది. అయితే, ఆ యువకుడి వద్ద ఉన్న పాము బాల్ పైథాన్‌గా, విదేశీ జాతికి చెందినదిగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో వారు ఆ కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనతో పామును విక్రయించిన వ్యక్తి ఎవరు? మరెంత మందికి ఇలాంటి విదేశీ జాతి పాములను విక్రయించారు? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. బెంగళూరులోనే ఈ అక్రమ విక్రయాల నెట్‌వర్క్ పనిచేస్తోందా అనే అంశాన్ని కూడా అటవీ శాఖ, పోలీసులు పరిశీలిస్తున్నారు.
అధికారుల ప్రకారం ప్రకారం.. విదేశీ జాతి పాములు పెంచాలంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నమోదు, అనుమతులు తప్పనిసరి. చట్టబద్ధ అనుమతులు లేకుండా ఇటువంటి జంతువులను పెంచడం లేదా విక్రయించడం చట్టవిరుద్ధమని అధికారులు హెచ్చరించారు. ఈ కేసులో మరికొందరి వ్యక్తుల ప్రమేయం ఉందా అనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
